ETV Bharat / city

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే... మన దగ్గరే విద్యుత్ కోతలు తక్కువ - మంత్రి పెద్దిరెడ్డి

author img

By

Published : Apr 27, 2022, 4:53 PM IST

Minister Review on New Power Units: విద్యుత్ కొరతను తీర్చే అంశంలో కొత్త విద్యుత్ ప్రాజెక్టులను వేగవంతం చేయాల్సి ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు.

Minister Peddireddy Ramachanda reddy
Minister Peddireddy Ramachanda reddy

Minister Review on New Power Units: విద్యుత్ కొరతను తీర్చే అంశంలో కొత్త విద్యుత్ ప్రాజెక్టులను వేగవంతం చేయాల్సి ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. సచివాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి ఈ అంశంపై సమీక్ష నిర్వహించారు. ఏపీలో కొత్త విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణ పురోగతిపై మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మరో మూడు నెలల్లో ఎన్టీపిఎస్ స్టేజ్ -5 పూర్తి చేయాలని మంత్రి ఆదేశాలిచ్చారు. కృష్ణపట్నం స్టేజ్ 2 ప్లాంట్ నిర్మాణం వేగవంతం చేయాలని సూచించారు. రెండు ప్లాంట్లు వినియోగంలోకి వస్తే ప్రస్తుత సామర్ధ్యానికి అదనంగా 1600 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని మంత్రి అన్నారు. కొత్త హైడల్ ప్రాజెక్ట్ ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచనలు ఇచ్చారు. దేశ వ్యాప్తంగా విద్యుత్ కొరత తీవ్రంగా ఉందని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోనే విద్యుత్ కోతలు తక్కువని మంత్రి వివరించారు.

ఇదీ చదవండి : తహసీల్దార్​ కార్యాలయంలో అనిశా సోదాలు..ఆన్​లైన్​ రికార్డుల పరిశీలన..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.