ETV Bharat / city

AP Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 896 కరోనా కేసులు, 6 మరణాలు

author img

By

Published : Feb 12, 2022, 5:31 PM IST

Updated : Feb 12, 2022, 5:41 PM IST

రాష్ట్రంలో కొత్తగా 896 కరోనా కేసులు
రాష్ట్రంలో కొత్తగా 896 కరోనా కేసులు

17:20 February 12

ఏపీ కరోనా కేసులు

ఏపీ కరోనా బులిటెన్
ఏపీ కరోనా బులిటెన్

AP CORONA CASES: రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 24,066 మందికి కొవిడ్ పరీక్షలు చేయగా.. 896 కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి 8,849 మంది పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 24,454 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. వైరస్ కారణంగా కొత్తగా మరో ఆరుగురు మరణించినట్లు పేర్కొంది.

దేశంలో మరో 50వేల కరోనా కేసులు..

భారత్​లో కరోనా కేసులు వరుసగా రెండోరోజు తగ్గాయి. కొత్తగా 50,407 మందికి వైరస్​ సోకింది. కొవిడ్​ ధాటికి మరో 804 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,36,962 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 3.48 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

యాక్టివ్​ కేసులు ప్రస్తుతం 1.43 శాతంగా ఉన్నాయి. రికవరీ రేటు 97.37 శాతానికి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

  • మొత్తం కేసులు: 4,25,86,544
  • మొత్తం మరణాలు: 5,07,981
  • యాక్టివ్ కేసులు: 6,10,443
  • మొత్తం కోలుకున్నవారు: 4,14,68,120

దేశంలో కొత్తగా 46,82,662 టీకా డోసులను పంపిణీ చేశారు. ఇప్పటివరకు మొత్తం 1,72,29,47,688 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ..

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఒక్కరోజే 23 లక్షల మంది మహమ్మారి బారిన పడ్డారు. మరో 10,927 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం కొవిడ్​ కేసుల సంఖ్య 40.86 కోట్లు దాటగా.. మరణాల సంఖ్య 58,19,705కు చేరింది.

జర్మనీలో మరో 2.29 లక్షల మంది వైరస్ బారినపడ్డారు. మరో 215 మంది ప్రాణాలు కోల్పోయారు. రష్యాలో ఒక్కరోజే 2 లక్షల మందికి కొవిడ్ పాజిటివ్​గా తేలింది. మరో 722 మంది మృతిచెందారు. బ్రెజిల్​లో కొత్తగా 1.66 లక్షల మందికి కరోనా సోకింది. 1,121 మంది మరణించారు. అమెరికాలో తాజాగా 1.49 లక్షల కేసులు బయటపడగా.. 1,917 మంది బలయ్యారు. ఫ్రాన్స్​లో ఒక్కరోజే 1.31 లక్షల మంది మందికి వైరస్ సోకింది. మరో 329 మంది మృతిచెందారు.

ఇదీ చదవండి

ఈ ద్రావణాన్ని పూస్తే... వస్త్రాలపై ఉండే వైరస్‌ ఖతం

Last Updated :Feb 12, 2022, 5:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.