ETV Bharat / city

విజయవాడ యువతి హత్య కేసులో కీలక మలుపు

author img

By

Published : Oct 24, 2020, 5:01 AM IST

విజయవాడలో ఇంజనీరింగ్ యువతిని ప్రేమోన్మాది బలి తీసుకున్న కేసులో కీలక విషయాలు వెలుగుచూశాయి. నిందితుడు నాగేంద్రబాబు చెప్పిన చెప్పిన మాటలన్నీ అవాస్తమని పోలీసులు తేల్చారు. పోస్టుమార్టం, ఫోరెన్సిక్‌ నివేదికల ఆధారంగా ఈ విషయాన్ని నిర్థారించుకున్నారు.

divya tejaswini
divya tejaswini

'మా ప్రేమను యువతి తల్లిదండ్రులు అంగీకరించలేదు. అందుకే మేమిద్దరం కలసి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాం. ఎవరికి వాళ్లం కత్తితో గాయాలు చేసుకున్నాం’ ఇవి విజయవాడకు చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థిని హత్య కేసులో నిందితుడు నాగేంద్రబాబు చెప్పిన మాటలు. ఇందులో ఏ మాత్రం నిజం లేదని పోలీసులు తేల్చారు. పోస్టుమార్టం, ఫోరెన్సిక్‌ నివేదికల ఆధారంగా పోలీసులు ఈ విషయాన్ని నిర్థారించుకున్నారు.

దివ్య శరీరంపై బలంగా, లోతుగా అయిన గాయాలు సొంతంగా చేసుకున్నవి కాదని... అందుకు అవకాశమే లేదని ఆ నివేదికల్లో వెల్లడైంది. దీనికి సంబంధించి పోలీసులు పలు సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలను సేకరించారు. ఈ కేసులో దర్యాప్తును పూర్తి చేసిన దిశ పోలీసులు ఛార్జిషీటును సిద్ధం చేశారు. ఈనెల 26వ తేదీన న్యాయస్థానంలో అభియోగపత్రం దాఖలు చేసే అవకాశముందని పోలీసులు చెబుతున్నారు. హత్య జరిగిన రోజు గదిలో ఏం జరిగిందనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. నిందితుడు నాగేంద్రబాబుని విచారిస్తేనే అసలు విషయాలు బయటకు వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిందితుడిని వైద్యులు డిశ్ఛార్జి చేయగానే పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు.

ఇదీ చదవండి

ప్రేమంటూ తిరిగాడు... ఒప్పుకోలేదని చంపేశాడు...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.