ETV Bharat / city

పార్టీ బలోపేతంపై పవన్ దృష్టి... త్వరలో క్షేత్రస్థాయి పర్యటనలు

author img

By

Published : Jul 30, 2019, 3:45 AM IST

జనసేనను మరే పార్టీలోనూ విలీనం చేసే ప్రసక్తే లేదని అధినేత పవన్ కల్యాణ్‌ మరోమారు స్పష్టం చేశారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ తొలి సమావేశంలో పాల్గొన్న పవన్ పార్టీ భవిష్యత్‌ అడుగులపై చర్చించారు. మరోమారు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లేందుకు నిర్ణయించారు. త్వరలోనే అన్ని నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జులను నియమించనున్నట్లు పార్టీ ప్రకటించింది.

పవన్
జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ తొలి సమావేశం

గత ఎన్నికల్లో ఓటమికి కారణాలను ఇప్పటికే విశ్లేషించుకున్న జనసేనాని పవన్ కల్యాణ్ పార్టీని మరింత బలమైన శక్తిగా మార్చే దిశగా వ్యూహాలు రచిస్తున్నారు. విజయవాడలోని కార్యాలయంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ తొలి సమావేశాన్ని పవన్ నిర్వహించారు. ప్రజాక్షేత్రంలోకి చురుగ్గా వెళ్లాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. గెలుపోటములతో సంబంధం లేకుండా పార్టీ నాయకులందరూ ఒకే మాట, ఒకే సూత్రం అవ‌లంబిస్తూ ఏక‌తాటిపై న‌డ‌వాల‌ని సూచించారు. తమతో నడవాలని కొన్ని పార్టీలు కోరుతున్నాయని.. ఏ పార్టీతో కలిసి వెళ్లినా లౌకిక పంథా విడనాడేది లేదని పవన్ స్పష్టం చేశారు. పార్టీ భావ‌జాలాన్ని, ప్రజల సమస్యలను అసెంబ్లీలో వినిపిస్తున్న రాజోలు ఎమ్మెల్యే వరప్రసాద్‌ను అభినందించారు. ప్రతి నియోజకవర్గానికి ఇన్‌ఛార్జి నియామకం నుంచి పార్టీ బలోపేతం వరకు అన్ని వ్యవహారాల్లో దూకుడు పెంచనున్నట్లు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ చెప్పారు.

పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీని ప్రస్తుతం 11మందితో ఏర్పాటు చేసినా, 18 మందికి దానిని పెంచేలా నిర్ణయించారు. ఓ వైపు కమిటీలతో సమావేశాలు నిర్వహిస్తూనే మళ్లీ క్షేత్రస్థాయిలో పర్యటించాలని పవన్ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెల మొదటి వారంలో భీమవరంలో పర్యటించి, పార్టీ కోసం పనిచేసి అనారోగ్యంతో చనిపోయిన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అనంతరం... తర్వాతి రెండు, మూడు నెల‌ల్లో అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో పర్యటిస్తారని తెలుస్తోంది.

Intro:

Body:ap_tpt_77_28_kishora balika dhinoshavam_av_c13

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఫోర్డ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రతి మండలంలో కిశోర బాలికల ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన, చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం తంబళ్లపల్లి మండలం కోస్ వారి పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో కిషోర్ బాలికల పరిశుభ్రత ఆరోగ్యంపై అవగాహన సదస్సు నిర్వహించారు.
సదస్సులో పాల్గొన్న వైద్య సిబ్బంది , ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కేంద్రాల సహాయకులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, కిశోర బాలికల నుద్దేశించి ఫోర్డ్ సంస్థ డైరెక్టర్ లలితమ్మ kosuvaripalle ఆసుపత్రి వైద్యులు, మండల వైద్యాధికారి నిరంజన్ కుమార్ రెడ్డి ,ఐ సి డి ఎస్ సూపర్వైజర్ శ్వేతా రెడ్డి పలు సూచనలు సలహాలు ఇచ్చారు. కిశోర బాలికలు తగిన జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యం పరిశుభ్రంగా ఉండగలుగుతారు. గ్రామాలలో ముమ్మరంగా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఫోర్డ్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు పేర్కొన్నారు.

R.sivaReddy tbpl. .
kit no 863
8008574616

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.