ETV Bharat / city

PAWAN: 'రోడ్డు మధ్యలో గోతులు కాదు.. గోతుల మధ్యే రోడ్లు'

author img

By

Published : Jul 14, 2022, 7:07 PM IST

Updated : Jul 14, 2022, 7:13 PM IST

PAWAN ON ROADS : రాష్ట్రంలో గోతుల మధ్య రోడ్డును వెతుక్కోవల్సి వస్తోందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. రోడ్లు ఈత కొలనులను తలపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. రోడ్ల దుస్థితి తెలిపేలా #GoodMorningCMSir అని డిజిటల్ క్యాంపెయిన్ చేపట్టనున్నట్లు పవన్ ప్రకటించారు.

PAWAN
PAWAN

PAWAN ON ROADS : రోడ్ల మీద ప్రయాణిస్తున్నప్పుడు ఒకటీ అరా గోతులు కనిపించడం సహజమని.. కానీ రాష్ట్రంలో మాత్రం గోతుల మధ్య రోడ్డును వెతుక్కోవలసిన పరిస్థితి నెలకొనడం దారుణమని విమర్శించారు. కొన్ని రహదారులు ఏకంగా ఈతకొలనులను మించిపోతున్నాయని.. రోడ్ల అభివృద్ధి చేతకాకపోతే కనీసం మరమ్మతులు చేయాలనే బాధ్యతను సైతం వైకాపా ప్రభుత్వం గాలి కొదిలేసిందని దుయ్యబట్టారు. వారికి బాధ్యత గుర్తు చేయాలనే #GoodMorningCMSir అనే హాష్ ట్యాగ్​తో ఈ నెల 15, 16, 17 తేదీల్లో జనసేన పార్టీ డిజిటల్ క్యాంపెయిన్ ప్రారంభిస్తోందని పవన్ ప్రకటించారు.

  • గోతుల మధ్య రోడ్డును వెదుక్కోవల్సి వస్తోంది -
    మీ ఊళ్ళో, మీ చుట్టు పక్కల రోడ్లు ఎంత దారుణంగా దెబ్బ తిన్నాయో.. ఆ రోడ్డు మీద వెళ్లేందుకు ఎంత ప్రయాస పడాల్సి వస్తోంది అనేది చెప్పే ఫోటోలు, వీడియోలు తీయండి. వాటిని #GoodMorningCMSir హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి. pic.twitter.com/qkcU9IYN7X

    — JanaSena Party (@JanaSenaParty) July 14, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

సీఎం సవాల్​ను స్వీకరించాం: జులై నెల 15 నాటికల్లా దెబ్బ తిన్న రోడ్ల మరమ్మతు పనులు పూర్తి చేసి.. ప్రతిపక్షాల నోరు మూయిస్తామని ముఖ్యమంత్రి సవాల్‌ చేశారని.. ఆ ఛాలెంజ్​ను స్వీకరించి రోడ్ల దుస్థితిపై ముఖ్యమంత్రి కళ్లు తెరిపించాలనే ఉద్దేశంతో ఈ డిజిటల్ క్యాంపెయిన్​కు శ్రీకారం చుట్టామన్నారు. ఆర్ అండ్ ​బీ పరిధిలో స్టేట్ హైవేలు 14,722 కి.మీ, మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్లు 32,240 కి.మీ, ఇతర రోడ్లు 6,100 కి.మీ ఉన్నాయని.. ముఖ్యంగా 9,222 కి.మీ పంచాయతీ రోడ్ల మరమ్మతుల కోసం రూ.1,072 కోట్లు కేటాయించామని ప్రభుత్వం ఏప్రిల్ నెలలో ప్రకటించిందన్నారు. దెబ్బ తిన్న రోడ్ల మరమ్మతులు జోరుగా సాగుతున్నాయని చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం మరో రకంగా ఉందని... రోడ్లపై పందులు స్వైర విహారం చేస్తున్నాయి. మూగ జీవాలు కదా.. వాటిని ఎందుకు ఇబ్బంది పెట్టాలి అనుకున్నారో ఏమోగానీ వైకాపా నాయకులు రోడ్లు వేయడం మానేశారని ఎద్దేవా చేశారు.

మరమ్మతులనే గాలికొదిలేశారు.. ఇంకా కొత్త రోడ్లు అంటే.. రాష్ట్రంలో 30 వేల కి.మీ మేర రోడ్లు కనీస మరమ్మతులకు నోచుకోలేక గుంతలమయంగా మారిందని పవన్ తెలిపారు. మూడేళ్లుగా పట్టించుకోకపోవడంతో చాలా వరకు కొత్తగా రోడ్డు వేయాల్సిన పరిస్థితి ఉందన్నారు. మరమ్మతులకే నిధులు లేక రోడ్లను గాలికొదిలేసిన ప్రభుత్వం.. కొత్త రోడ్లు వేయడం అంటే ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితులరీత్యా అసాధ్యమేనన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రోడ్లు కనీస మరమ్మతులు, ఒక లేయర్ వేసి కాస్త ప్రయాణానికి తగ్గ విధంగా చేయాలంటే దాదాపు రూ.7 వేల కోట్లు అవసరమవుతాయన్నారు. 8వేల కి.మీ రోడ్లు మెయింటినెన్స్ కోసం బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ.2,100 కోట్లు అప్పు తెచ్చారని.. వాటితో రిపేర్లు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోందన్నారు. కానీ ప్రభుత్వం నుంచి బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు చేయడం లేదన్నారు.

అభివృద్ధి అంటే సంక్షేమ పథకాలు మాత్రమే కాదు: రోడ్లు నిర్వహణ కోసం అని పెట్రో సెస్ వసూలు చేస్తున్నారని.. ఇది రూ.750 కోట్ల మేర ఏటా ప్రభుత్వానికి చేరుతుందన్నారు. ఈ నిధులు ఎక్కడికి వెళ్తున్నాయో ఎవరికి తెలియడం లేదని పవన్‌ వ్యాఖ్యానించారు. అభివృద్ధి అంటే సంక్షేమ పథకాలు అమలు చేస్తే చాలు.. రోడ్లు అవసరం లేదు అనే ఆలోచన విధానంతో వైకాపా ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి మౌలిక సదుపాయాలు ఎంత అవసరమో తెలియజేయడం కోసం #GoodMorningCMSir అనే డిజిటల్ క్యాంపెయిన్ ప్రారంభిస్తున్నామని.. ఎవరికి వారు తమ తమ గ్రామాలు, పట్టణాలు, చుట్టు పక్కల రోడ్లు ఎంత దారుణంగా దెబ్బ తిన్నాయో.. ఆ రోడ్డు మీద వెళ్లేందుకు ఎంత ప్రయాస పడాల్సి వస్తోందో చెప్పే ఫొటోలు, వీడియోలు తీయాలని... వాటిని #GoodMorningCMSir అనే హ్యాష్ ట్యాగ్​తో సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని పవన్‌ పిలుపునిచ్చారు. దెబ్బ తిన్న రోడ్ల దుస్థితిపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని #JSPForAP_Roads అనే హాష్ ట్యాగ్​తో గత ఏడాది సెప్టెంబర్ 2, 3, 4 తేదీల్లో డిజిటల్ క్యాంపెయిన్ చేశామని పవన్ గుర్తు చేశారు.

ఇదీ చదవండి:

'ముఖ్యమంత్రి గారూ.. ఛాలెంజ్​ను స్వీకరిస్తారా? చేతులెత్తేస్తారా?'

'భార్యగా ఉంటే నెలకు రూ.25 లక్షలు ఇస్తానన్నాడు: హీరోయిన్'

8 ఏళ్లుగా రేప్.. మహిళ ఆత్మహత్య- కూతురి జననాంగాల్లో వేడి నూనెపోసి..

Last Updated : Jul 14, 2022, 7:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.