ETV Bharat / city

కృష్ణా, గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు.. జనసేన అభ్యర్థి ఖరారు

author img

By

Published : Feb 21, 2021, 9:35 PM IST

లోకజ్ఞానం, మంచి ప్రవర్తనను నేర్పించే ఉపాధ్యాయులను వైకాపా ప్రభుత్వం అవమానించిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా - గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరును ఆయన ప్రకటించారు. ప్రముఖ న్యాయవాది గాదె వెంకటేశ్వరరావు పేరును ప్రతిపాదిస్తూ... ఆయనకు మద్దతుగా నిలవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

janasena leader pawan kalyan announced krishna-guntur district mlc  candidate
జనసేన అధినేత పవన్ కల్యాణ్

కృష్ణా - గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం కోసం జనసేన అభ్యర్థిని ప్రకటించింది. ప్రముఖ న్యాయవాది గాదె వెంకటేశ్వరరావు పేరును ప్రతిపాదించింది. శాసన మండలిలో ఉపాధ్యాయుల సమస్యలు వినిపించడానికి బలమైన గొంతుక అవసరమని, అందుకే ఆయన పేరును ప్రకటించినట్లు పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చెప్పారు.

జ్ఞానాన్ని, మంచి నడవడికను నేర్పించే ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని వైకాపా ప్రభుత్వం మంటగలిపిందని పవన్ కల్యాణ్ విమర్శించారు. ఉపాధ్యాయులను వైన్ షాపుల ముందు క్యూ లైన్లు సరిచేసే వాచ్​మెన్​ పనులకు ఉపయోగించి అవమానించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుతర బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారిని అనేక సమస్యలు పీడిస్తున్నాయన్నారు. కుల, మతాలకు అతీతంగా ఏ సమయంలో అయినా ప్రజలకు అండగా నిలబడే గాదె వెంకటేశ్వర రావు లాంటి వ్యక్తులు సమాజ సేవలోకి రావాలని పవన్ అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి:

'పంచాయతీ పోరులో అధికార పార్టీ అప్రజస్వామిక విధానాలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.