ETV Bharat / city

RAHUL MURDER CASE : రాహుల్ హత్య కేసు... కీలక నిందితుల కోసం గాలింపు

author img

By

Published : Aug 21, 2021, 2:27 AM IST

Updated : Aug 21, 2021, 4:08 AM IST

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన విజయవాడకు చెందిన పారిశ్రామికవేత్త రాహుల్‌ హత్య కేసులో కీలక నిందితుడు విజయ్‌కుమార్‌ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. హత్య జరిగినప్పుడు కోరాడ విజయ్‌కుమార్‌ ప్రత్యక్షంగా ఉన్నాడని భావిస్తున్న పోలీసులు... అతని కోసం బెంగళూరు, విశాఖ, హైదరాబాద్‌లో ప్రత్యేక బృందాలతో వెతుకులాట కొనసాగిస్తున్నారు. కోరాడ అనుచరులను కొందరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

రాహుల్ హత్య కేసు
రాహుల్ హత్య కేసు

కారులో హత్యకు గురైన పారిశ్రామికవేత్త రాహుల్‌ కేసు దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న నిందితులపై దృష్టి సారించారు. వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే... హత్యకు దారితీసిన కారణాలు తెలుసుకోవచ్చని పోలీసులు భావిస్తున్నారు. నిందితులు విజయకుమార్, పద్మజ, గాయత్రి పరారీలో ఉన్నారు. హత్య ఘటనలో విజయ్‌కుమార్‌కు నేరుగా ప్రమేయం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఘటన జరిగినప్పుడు అతను కారులోనే ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

కోరాడ విజయ్‌కుమార్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. బెంగళూరు, విశాఖ, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల్లో తలదాచుకునే అవకాశం ఉండొచ్చని నిర్ధరణకు వచ్చారు. కోరాడ పట్టుబడితే కేసు మిస్టరీ వీడే అవకాశముంది. ఇందులో ఎవరెవరి ప్రమేయం ఉంది.. తెర వెనుక ఎవరు ఉన్నారు వంటి కీలక విషయాలు బయటకొస్తాయి. కోరాడ ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేయటంతో... అతని అనుచరులపై పోలీసులు నిఘా పెట్టారు. వారి ఫోన్‌కాల్స్‌పై దృష్టి సారించారు. ఇప్పటికే కొందరు అనుచరులను అదుపులోకి తీసుకుని గుట్టుగా ప్రశ్నించగా... పలు కీలక విషయాలు తెలిసినట్లుగా సమాచారం.

గొంతుకు తాడు బిగించి రాహుల్‌ను హత్య చేసినట్లుగా శవపరీక్షలో వైద్యులు గుర్తించారు. రెండు చేతులపై బాగా గాయాలు ఉన్నట్లు తేలటంతో... కొన్ని శరీర భాగాలను ఫోరెన్సిక్‌ ల్యాబ్స్‌కు పంపించారు. ఈ నివేదిక వచ్చేందుకు కొంత సమయం పడుతుందని అధికారులు చెప్పటంతో ఈలోగా నగరంలో నేరచరిత్ర ఉన్నవారి కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. అనుమానం ఉన్నవారిని పిలిపించి ప్రశ్నిస్తున్నారు.

రాహుల్ హత్య కేసు

అనుబంధకథనం

DEADBODY IN CAR: రాహుల్​ది హత్యగా ప్రాథమిక నిర్ధారణ.. ఆధారాలు లభ్యం!

Last Updated : Aug 21, 2021, 4:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.