ETV Bharat / city

'సలాం కుటుంబ ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగించండి'

author img

By

Published : Dec 1, 2020, 3:42 PM IST

రాష్ట్రంలో ముస్లింల మీద జరుగుతున్న దాడులపై అసెంబ్లీలో చర్చించాలని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ డిమాండ్ చేసింది. విజయవాడ ధర్నా చౌక్​లో ధర్నా చేపట్టింది.

indian Union Muslim League protest
ముస్లింలపై జరుగుతున్న దాడులపై అసెంబ్లీలో చర్చించాలి

నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబ ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ... ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ధర్నాకు దిగింది. విజయవాడ ధర్నా చౌక్​లో ఆందోళన చేసిన లీగ్ నేతలు.. రాష్ట్రంలో ముస్లింలపై జరుగుతున్న దాడుల గురించి శాసనసభలో చర్చించాలని డిమాండ్ చేశారు. ధర్నాకు తెదేపా, కాంగ్రెస్ నాయకులు సంఘీభావం తెలిపారు.

వైకాపా సర్కార్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ముస్లిం, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రక్షణ లేకుండా పోయిందని తెదేపా అధికార ప్రతినిధి షేక్ నాగుల్ మీరా మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్.. వెనుకబడిన వర్గాల వ్యతిరేకి అని, కడుపులో విషాన్ని పెట్టుకొని, కళ్లలో కపట ప్రేమను చూపిస్తున్నారని ఆరోపించారు.

ఇవీ చూడండి:

నిరుపయోగంగా వైఎస్సార్‌ రిసెప్షన్‌ కేంద్రాలు.. వాటికి కేటాయిస్తే మేలు!

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.