ETV Bharat / city

'తెలుగు సాహిత్యంలో ఇనాక్​ది కొత్త ఒరవడి'

author img

By

Published : Aug 12, 2019, 11:55 PM IST

ప్రముఖ రచయిత, సాహితీ విమర్శకులు ఆచార్య కొలకలూరి ఇనాక్... తెలుగు సాహిత్యంలో నూతన ఒరవడిని సృష్టించారని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ వ్యాఖ్యనించారు. ఆయన రాసిన మనూళ్లలో మా కథలు అనే పుస్తకాన్ని విజయవాడలో ఆవిష్కరించారు.

తెలుగు సాహిత్యంలో ఇనాక్ కొత్తవరవడి సృష్టించారు

తెలుగు సాహిత్యంలో ఇనాక్ కొత్తవరవడి సృష్టించారు

ప్రముఖ రచయిత, సాహితీ విమర్శకులు ఆచార్య కొలకలూరి ఇనాక్ రాసిన మనూళ్లలో మాకథలు అనే పుస్తకాన్ని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, ఐపీఎస్ అధికారి సత్యనారాయణ ఆవిష్కరించారు. విజయవాడలోని ఓ హోటల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు రచయితలు, సాహితీ ప్రియులు పాల్గొన్నారు. తెలుగు సాహిత్యంలో ఇనాక్ కొత్త ఒరవడి సృష్టించారని.. ఆయన రాసిన ఎన్నో కథలు, నాటకాలు జనబాహుళ్యంలో విశేష ఆదరణ పొందాయని వక్తలు కొనియాడారు. ఇదే కార్యక్రమంలో కొలకలూరి ఇనాక్ జీవితంపై.. మరో రచయిత విహారి రచించిన అద్వితీయ పుస్తకాన్నీ అతిథులు ఆవిష్కరించారు.

ఇదీ చదవండి

13 ఏళ్ల తర్వాత మేకప్ వేసుకున్న విజయశాంతి

Intro:Ap_cdp_47_12_vybhavanga_tyagaraja swamy_Aradhana_Av_Ap10043
k.veerachari, 9948047582
సంగీతానికి ఆరాధ్యులు త్యాగరాజస్వామి అని మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి తెలిపారు. కడప జిల్లా రాజంపేటలో నాయి బ్రాహ్మణ ఆధ్వర్యంలో త్యాగరాజస్వామి ఆరాధనోత్సవం వైభవంగా జరిగింది. తొలుత పట్టణంలోని ఆంజనేయస్వామి ఆలయంలో త్యాగరాజస్వామి చిత్రపటానికి పూలమాలవేసి వేసి పూజలు చేసారు. అక్కడి నుంచి ఈ ప్రాంతంలో చిత్రపటాన్ని ఊరేగింపుగా వజ్రమ్మ కళ్యాణ మండపం వరకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నో వేల భక్తి కీర్తనలతో అలరించిన మహనీయుడు అని కొనియాడారు. ఈ సందర్భంగా సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని నాయి బ్రాహ్మణులు అందజేశారు. శ్రీ కాళహస్తి నుంచి వచ్చిన నాదస్వర డోల్ కళాకారులు తమ వాయిద్యాలతో అలరించారు.


Body:వైభవంగా త్యాగరాజ స్వామి ఆరాధన ఉత్సవం


Conclusion:మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.