ETV Bharat / city

IAS officers transfers: రాష్ట్రంలో 15 మంది ఐఏఎస్‌ల బదిలీలు, పోస్టింగ్‌లు

author img

By

Published : Jul 23, 2021, 10:45 PM IST

Updated : Jul 23, 2021, 11:34 PM IST

collectors
collectors

22:36 July 23

IAS officers transfers

రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 15 మంది ఐఏఎస్‌లకు బదిలీలు, పోస్టింగ్‌లు ఇస్తున్నట్టు ఉత్తర్వులలో పేర్కొంది. విశాఖ జిల్లా కలెక్టర్‌గా ఎ.మల్లికార్జున, విజయనగరం కలెక్టర్‌గా ఎ.సూర్యకుమారి, తూర్పు గోదావరి కలెక్టర్‌గా సీహెచ్‌.హరికిరణ్‌, కడప జిల్లా కలెక్టర్‌గా విజయరామరాజు, కర్నూలు జిల్లా కలెక్టర్‌గా పి.కోటేశ్వరరావును నియమించింది.

వైద్యశాఖ ఏపీఎంఎస్‌ఐడీసీ ఎండీగా మురళీధర్‌రెడ్డి, ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవోగా వినయ్‌చంద్‌, కమిషనర్‌ ఆర్‌అండ్‌ఆర్‌గా హరిజవహర్‌లాల్‌, పౌరసరఫరాలశాఖ వీసీ, ఎండీగా జి.వీరపాండియన్‌, విశాఖ వీఎంఆర్‌డీఏ కమిషనర్‌గా కె.వెంకటరమణారెడ్డి, పశ్చిమగోదావరి జిల్లా జేసీగా సుమిత్‌కుమార్‌ (రైతుభరోసా కేంద్రం) శ్రీకాకుళం జేసీగా బీఆర్‌ అంబేడ్కర్‌, చేనేత శాఖ సంచాలకుడిగా పి.అర్జున్‌రావు, దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్‌కు కమిషనర్‌గాను అదనపు బాధ్యతలు అప్పగించారు. చిత్తూరు జేసీగా స్వప్నిల్‌ దినకర్‌, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ వీసీ, ఎండీగా ప్రభాకర్‌రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

ఇదీ చదవండి

telangana: నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఘోర ప్రమాదం, ఏడుగురు మృతి

Last Updated : Jul 23, 2021, 11:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.