ETV Bharat / city

Naga Shaurya farm house case: పోలీస్ స్టేషన్‌కు నేడు హీరో నాగశౌర్య తండ్రి

author img

By

Published : Nov 3, 2021, 10:34 AM IST

తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా మంచిరేవుల ఫామ్‌హౌస్ పేకాట కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ప్రధాన నిందితుడు సుమన్‌ను రెండు రోజుల కస్టడీకి ఉప్పరపల్లి కోర్టు అప్పగించింది. గుత్తా సుమన్‌ను నార్సింగి పోలీసులు నేడు, రేపు ప్రశ్నించనున్నారు. నాగశౌర్య తండ్రి రవీంద్ర ప్రసాద్ ఇవాళ పోలీస్ స్టేషన్‌కు రానున్నారు.

Hero Naga Shourya father was taken to the police station today as part of the Manchirevula Farmhouse poker case
పోలీస్ స్టేషన్‌కు నేడు హీరో నాగశౌర్య తండ్రి

తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా మంచిరేవుల ఫామ్‌హౌస్ పేకాట కేసు(Naga Shaurya farm house case) దర్యాప్తు కొనసాగుతోంది. ప్రధాన నిందితుడు సుమన్‌ను రెండు రోజుల కస్టడీకి ఉప్పరపల్లి కోర్టు అప్పగించింది. గుత్తా సుమన్‌ను నార్సింగి పోలీసులు నేడు, రేపు ప్రశ్నించనున్నారు. నాగశౌర్య తండ్రి రవీంద్ర ప్రసాద్ ఇవాళ పోలీస్ స్టేషన్‌కు రానున్నారు. ఫామ్‌హౌస్‌(Naga Shaurya farm house case) రెంటల్ అగ్రిమెంట్లు తీసుకురావాలని పోలీసులు సూచించినట్లు తెలుస్తోంది. రెంటల్ అగ్రిమెంట్ల ఆధారంగా రవీంద్రను పోలీసులు ప్రశ్నించనున్నారు. మరోవైపు గుత్తా సుమన్‌పై ఏపీలో ఉన్న కేసులపై నార్సింగి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసులు ఇప్పటికే సుమన్‌పై కేసుల వివరాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. బ్లాక్ మెయిల్, ఫోర్జరీ, చీటింగ్ కేసులున్నట్లు పోలీసులు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

ఆసక్తికర మలుపులు

రాజధాని శివారులోని మంచిరేవుల ఫాంహౌస్​ వ్యవహారంలో ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. టాలీవుడ్‌ యువ హీరో నాగశౌర్య తండ్రి.. నగర శివారుల్లోని మంచిరేవుల ఫాంహౌస్‌(Naga Shourya farmhouse)ను దాని యజమాని (ఓ మాజీ ఉన్నతాధికారి) నుంచి అయిదేళ్లకు అద్దెకు తీసుకున్నారు. ఈ వ్యవహారంలో మణికొండకు చెందిన గుత్తా సుమన్‌ కుమార్‌ ప్రధాన సూత్రధారి అని దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో సుమన్‌, నాగశౌర్యల మధ్య సంబంధాలపై పోలీసులు కూపీ లాగుతున్నారు. ఏపీ ఇంటెలిజెన్స్‌ పోలీసులు కేసు వివరాలు తెలుసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

తెలుగు రాష్ట్రాల్లోనూ కేసులు..

విజయవాడకు చెందిన గుత్తా సుమన్‌కుమార్‌పై ఏపీ, తెలంగాణలోని వివిధ ఠాణాల్లో పలు కేసులు నమోదైనట్లు నార్సింగి పోలీసులు ప్రాథమిక సమాచారాన్ని సేకరించారు. ఆగస్టు 15న గచ్చిబౌలి ఠాణా పరిధిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో పేకాట ఆడుతూ సైబరాబాద్‌ పోలీసులకు చిక్కినట్టు కూడా గుర్తించారు. ‘సుమన్‌కుమార్‌ చుట్టూ బాడీగార్డులను పెట్టుకుని ప్రముఖుడిగా చలామణి అవుతుంటాడు. పెద్దవాళ్లతో పరిచయం ఉందని చెబుతూ ఎందరినో మోసం చేశాడు. భూకబ్జాలకు పాల్పడినట్లు ప్రాథమికంగా గుర్తించాం. మామిడి తోటల్లో పేకాట శిబిరాలు నిర్వహించే స్థాయి నుంచి ఫాంహౌస్​లు, స్టార్‌హోటళ్లు, అపార్ట్‌మెంట్లలో గదులను అద్దెకు తీసుకుని ప్రత్యేక క్యాంప్‌(క్యాసినో)లను ఏర్పాటుచేసే స్థాయికొచ్చాడు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులతో వాట్సాప్‌ గ్రూప్‌లు ఏర్పాటుచేశాడు. స్థిరాస్తి వ్యాపారంలోనూ అడుగుపెట్టాడు. ఓ న్యూస్‌ ఛానెల్‌కు డైరెక్టర్‌గానూ పనిచేశాడు. ఓ స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి భారీగా మోసాలకు పాల్పడ్డాడు’ అని ఓ పోలీసు అధికారి తెలిపారు. మరో గంట వేచిఉంటే ఫాంహౌస్​లో పేకాట ఆడేందుకు మరికొందరు ప్రముఖులు వచ్చేవారన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.