ETV Bharat / city

పోలవరం డీపీఆర్‌-2ను ఆమోదించండి.. ప్రధానికి జీవీఆర్‌ శాస్త్రి లేఖ!

author img

By

Published : Jun 6, 2021, 9:54 AM IST

పోలవరానికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌-2)ను ఆమోదించాలని ప్రధాని మోదీకి అఖిలభారత హిందూ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి, అమరావతి జేఏసీ ఛైర్మన్‌ ప్రొ.జీవీఆర్‌ శాస్త్రి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ప్రధానికి లేఖ రాశారు.

డీపీఆర్‌-2ను ఆమోదించండి..  ప్రధానికి జీవీఆర్‌ శాస్త్రి లేఖ
డీపీఆర్‌-2ను ఆమోదించండి.. ప్రధానికి జీవీఆర్‌ శాస్త్రి లేఖ

పోలవరానికి సంబంధించిన డీపీఆర్‌-2 ఆమోదానికి సంబంధించి కొంత గందరగోళం నెలకొన్నట్లు తెలుస్తోందని ప్రధాని మోదీకి అఖిల భారత హిందూ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి, అమరావతి జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ జీవీఆర్ శాస్త్రి లేఖ రాశారు. జల్‌శక్తిలోని పలు కమిటీలు డీపీఆర్‌-2 ప్రకారం రూ.47,724 కోట్లు అంచనాలను ఆమోదించాయన్నారు. 2014-19 మధ్య తెదేపా హయాంలో 65 నుంచి 70 శాతం పనులు పూర్తయ్యాయని వివరించారు. ఆ సమయంలో నాబార్డు ద్వారా బిల్లుల చెల్లింపునకు కేంద్రం సుముఖంగా ఉన్నా తెలంగాణ ప్రభుత్వం ఏడు విలీన మండలాల రెవెన్యూ, ఇతర రికార్డుల అందజేతలో జాప్యం చేసిందన్నారు.

2019లో వైకాపా ప్రభుత్వం అధికారంలోకొచ్చాక గత ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందనే సాకుతో రాజధాని అమరావతితోపాటు పోలవరం పనులను నిలిపేసిందని తెలిపారు. పోలవరం టెండర్లు రద్దు చేసి రివర్స్‌ టెండర్లు పిలవడంతో 8నెలలపాటు పనులు నిలిచిపోయాయని చెప్పారు. 2020 నవంబరునుంచి ప్రాజెక్టు పనులు తిరిగి ప్రారంభమయ్యాయని, డీపీఆర్‌-2 ఆమోదించి ఏడాదికి రూ.9 వేల కోట్ల చొప్పున వచ్చే మూడేళ్లపాటు ఇవ్వాలని కోరారు. ప్రాజెక్టు పూర్తి నీటినిల్వ సామర్థ్యం +150 అడుగులకు తగ్గకుండా చూడాలని కోరారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలనివ్వాలని సూచించారు.

ఇదీ చదవండి:

polavaram: పోలవరం పూర్తి చేసేందుకు వందల కోట్లు కావాలి.. కానీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.