ETV Bharat / city

కొవిడ్ థర్డ్​ వేవ్​ నివారణలోనూ మీ వంతు బాధ్యత నిర్వర్తించండి: గవర్నర్

author img

By

Published : Aug 6, 2021, 7:09 PM IST

'థర్డ్ వేవ్ నివారణపై అవగాహన-స్వచ్ఛంధ సంస్ధల పాత్ర' అనే అంశంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రత్యేక వెబినార్ నిర్వహించారు. కరోనా తొలి, మలి దశల్లో పలు స్వచ్ఛంద సంస్ధల సేవలు అద్భుతమని.. అదే క్రమంలో మూడో దశను ఎదుర్కోవడానికి తమదైన పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉండాలని ఆయా సంస్థల ప్రతినిధులకు సూచించారు.

webinar on covid 3rd wave
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్

కరోనా థర్డ్​ వేవ్​ వ్యాప్తిని నిరోధించడంలో ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రం ఇతరులకు దిక్సూచిగా నిలవాలని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆకాంక్షించారు. కరోనా తొలి, మలి దశల్లో పలు స్వచ్ఛంద సంస్ధలు అద్భుతంగా పని చేశాయని.. అదేక్రమంలో మూడో దశను ఎదుర్కోవడానికి తమదైన పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు 'థర్డ్ వేవ్ నివారణపై అవగాహన-స్వచ్ఛంధ సంస్ధల పాత్ర' అనే అంశంపై ప్రత్యేక వెబినార్ నిర్వహించారు. స్వచ్ఛంద సంస్ధల ప్రతినిధులను ఉద్దేశించి గవర్నర్ పలు సూచనలు చేశారు. టీకాలు తీసుకొని వాళ్లను చైతన్యవంతం చేయాలన్నారు. మొదటి, రెెండో దశలో అనుభవాలతో ముందుకు సాగాలని.. అందుబాటులో ఉన్న వనరులను సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు.

ప్రభుత్వం ఆరోగ్య మౌలిక సదుపాయాలను పెంపొందిస్తూ.. వెంటిలేటర్లు, బెడ్‌లు, పీపీఈ కిట్‌లు, మొదలైన వాటిని పూర్తిస్ధాయిలో సమీకరిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వేగవంతమైన వ్యాక్సినేషన్ డ్రైవ్ కారణంగా అనేకమందిని వైరస్ బారినపడకుండా రక్షించగలిగామని పేర్కొన్నారు. వచ్చే ప్రతి దశలోనూ మనం ఎదుర్కొనే సమస్యలు విభిన్నంగా ఉంటున్నాయని.. భౌతిక దూరం పాటించడం, మూస్కులు పెట్టుకోవడం, చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవటం వంటివి మూడో దశ నివారణలో సహాయపడతాయన్నారు.

కొత్త పోకడలతో అభివృద్ది చెందుతున్న కరోనా.. గంతలో కన్నా వేగంగా వ్యాప్తి చెందుతుందని నిపుణులు చెబుతున్నారని.. సామాజిక, మతపరమైన సమావేశాలకు దూగంగా ఉండాలన్నారు. జనసమూహాలతో కలిసేటప్పుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కరోనా వచ్చినప్పటికీ టీకా ద్వారా ప్రాణాప్రాయం నుంచి బయటపడొచ్చన్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 15 ప్రభుత్వేతర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి..

ap corona cases: రాష్ట్రంలో కొత్తగా 2,209 కరోనా కేసులు.. 22 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.