ETV Bharat / city

'అభివృద్ధి చెందిన దేశాల్లో క్షయ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది'

author img

By

Published : Dec 18, 2020, 5:52 PM IST

క్షయవ్యాధి వ్యాప్తిలో నాలుగో వంతు కేసులు మన దేశంలోనే ఉన్నాయని గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్ వ్యాఖ్యనించారు. రాజ్​భవన్​లో 71వ టీబీ సీల్ సేల్ క్యాంపెయిన్‌ ప్రారంభించిన ఆయన... అభివృద్ధి చెందిన దేశాలకూ వ్యాధి వ్యాప్తి చెందటం ఆందోళన కలిగిస్తోందన్నారు.

Governor biswabhushan tb seal campaign
Governor biswabhushan tb seal campaign

అభివృద్ధి చెందిన దేశాలకు సైతం...క్షయవ్యాధి వ్యాప్తి చెందటం ఆందోళన కలిగిస్తోందని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. విజయవాడ రాజ్ భవన్​లో 71వ టీబీ సీల్ సేల్ క్యాంపెయిన్‌ను ఆయన ప్రారంభించారు. క్షయవ్యాధి వ్యాప్తిలో నాలుగోవంతు కేసులు మన దేశంలోనే ఉండటం ఆందోళన కలిగిస్తోందని అని అన్నారు. రాష్ట్రంలో ఈ వ్యాధితో దాదాపు లక్ష మంది వరకూ బాధపడుతుండగా...,91 శాతం కోలుకోవటం శుభసూచకమన్నారు.

2030 నాటికి క్షయవాధిని నిర్మూలించాలన్నది ప్రపంచ లక్ష్యమైతే..దాని కన్నా ముందు 2025 నాటికే నిర్మూలించేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని అన్నారు. వ్యాధి నియంత్రణలో ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు తమ వంతు పాత్ర పోషిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో వ్యాధిని పూర్తిగా నివారించడంలో...ఆరోగ్య శాఖ, టీబీ అసోషియేషన్‌ కృషి విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

ఇదీచదవండి

నష్టపోయిన రైతులకు పెట్టుబడి కింద రాయితీ చెల్లింపులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.