ETV Bharat / city

292 ఉన్నత పాఠశాలలు అప్​గ్రేడ్​.. హైస్కూల్​ ప్లస్​గా మార్పు

author img

By

Published : Jul 7, 2022, 7:32 PM IST

SCHOOLS UPGRADE: రాష్ట్ర వ్యాప్తంగా 292 ఉన్నత పాఠశాలలను హైస్కూల్ ప్లస్​గా మార్పు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పాఠశాలల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీలలో రెండు కోర్సులు మాత్రమే అందించనున్నట్లు స్పష్టం చేసింది. హైస్కూల్ ప్లస్ పాఠశాలలను బాలికలకు ప్రత్యేకంగా కేటాయిస్తూ ఆదేశాలు వెలువరించింది.

SCHOOLS UPGRADE
SCHOOLS UPGRADE

HIGH SCHOOL PLUS: రాష్ట్రవ్యాప్తంగా 292 ఉన్నత పాఠశాలలను హైస్కూల్ ప్లస్​గా మార్పు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పాఠశాలలను బాలికలకు ప్రత్యేకంగా కేటాయిస్తూ ఆదేశాలు వెలువరించింది. ఈ పాఠశాలల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీలలో రెండు కోర్సులు మాత్రమే అందించనున్నట్లు స్పష్టం చేసింది. స్థానికంగా ఉన్న డిమాండ్​ను అనుసరించి కోర్సులు నిర్ధారించాలని నిర్ణయించింది. పీజీటీ సమాన స్థాయి అధ్యాపకులనే బోధనకు తీసుకోనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. 1752 స్కూల్ అసిస్టెంట్​లను 292 జూనియర్ కళాశాలలలో పని చేసేందుకు నియమిస్తామని వెల్లడించింది. పాఠశాలల్లో నాడు- నేడు పనులు చేపట్టిన దృష్ట్యా.. అదనపు తరగతి గదులను మంజూరు చేయబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.