ETV Bharat / city

విజయసాయి రెడ్డీ... సెర్బియా పోలీసులకు సమాధానం చెప్పు...

author img

By

Published : Aug 1, 2019, 1:54 PM IST

మాజీ మంత్రులు దేవినేని ఉమ, కొల్లు రవీంద్రలు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెదేపా నేతలకు వ్యతిరేకంగా ట్వీట్లు చేసే విజయసాయిరెడ్డి... సెర్బియా పోలీసులు అరెస్ట్ చేయటానికి వెతుకుతుంటే ఎందుకు స్పందించటం లేదని విమర్శించారు.

విజయసాయి రెడ్డిపై విమర్శలు

రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డిపై మాజీ మంత్రులు దేవినేని ఉమ, కొల్లు రవీంద్రలు నిప్పులు చెరిగారు. ఉదయం లేచినప్పటినుంచి తెదేపా నాయకులకు వ్యతిరేకంగా ట్వీట్లు చేసే విజయసాయి... సెర్బియా పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తుంటే ఎందుకు స్పందించడం లేదని దేవినేని మండిపడ్డారు. ఆ కేసు నుంచి తప్పించుకునేందుకు వైకాపా ఎంపీలు కేంద్ర విదేశాంగ మంత్రి చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. చరిత్రలో నిలిచిపోయేలా గత ఐదేళ్లలో పోలవరం నిర్మాణ పనులు చేపడితే... వైకాపా నేతలు విమర్శిచడం సిగ్గుచేటన్నారు. వైకాపా ప్రభుత్వ అసమర్థత వల్లే బందరు పోర్టు పనులు చేసే యంత్రాలు వెనక్కివెళ్లాయని కొల్లు రవీంద్ర విమర్శించారు. బందరు పోర్ట్ పై ప్రభుత్వం ఇచ్చిన రహస్య జీవో లు బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు.

విజయసాయి రెడ్డిపై విమర్శలు

ఇదీచదవండి

అన్న క్యాంటీన్ల మూసివేత... అన్నార్ధుల్లో నిరాశ!

Intro:AP_VJA_25_01_SFI_NIRASANA_ON_FEE_REIMBURSEMENT_AVB_AP10050
Etv Contributor : Satish Babu, Vijayawada
Phone : 9700505745
( ) బకాయి ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్స్ తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విజయవాడ ధర్నాచౌక్లో ఆందోళనకు దిగిన విద్యార్థులు.ఫీజు రీయంబర్స్మెంట్ , స్కాలర్షిప్పులు లేక విద్యార్థులు సిబ్బంది పడుతున్నారని అఖిల భారత విద్యార్థి సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి కోటి అన్నారు. విద్యార్థులకు కేటాయించిన నిధులను ప్రభుత్వం సంక్షేమ పథకాలకు మళ్ళించి, విద్యార్థులకు రావలసిన ఫీజు రీయింబర్స్మెంటు స్కాలర్షిప్పుల చెల్లింపులు చేయడం లేదని ఆరోపించారు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించాలని, మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయ పాత్ర వంటి ప్రైవేటు సంస్థకు అప్పగించరాదని డిమాండ్ చేశారు.
బైట్... కోటి అఖిల భారత విద్యార్థి సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి


Body:AP_VJA_25_01_SFI_NIRASANA_ON_FEE_REIMBURSEMENT_AVB_AP10050


Conclusion:AP_VJA_25_01_SFI_NIRASANA_ON_FEE_REIMBURSEMENT_AVB_AP10050
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.