ETV Bharat / city

RGV on Chalo Vijayawada: 'జనసందోహాన్ని చూసి నాకు చలి జ్వరం వచ్చింది': రామ్​గోపాల్ వర్మ

author img

By

Published : Feb 4, 2022, 3:30 PM IST

RGV on Chalo Vijayawada: రాష్ట్రంలో ఉద్యోగులు చేస్తున్న ఉద్యమంపై దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ట్విటర్​లో తనదైన శైలిలో స్పందించారు. ‘ఏపీ సర్కారు సంగతేమోగానీ, విజయవాడలో జన సందోహాన్ని చూసి నాకు చలి జ్వరం వచ్చింది’’ అని ట్వీట్‌ చేశారు.

Director RGV on employees Chalo Vijayawada
ఉద్యోగులు చేస్తున్న ఉద్యమంపై ఆర్జీవీ వ్యాఖ్యలు

RGV on Chalo Vijayawada: సమకాలీన అంశాలపై ఎప్పటికప్పుడూ సామాజిక మాధ్యమాల్లో తన అభిప్రాయాల్ని వ్యక్తం చేసే రామ్‌గోపాల్‌ వర్మ.. రాష్ట్రంలో ఉద్యోగులు చేస్తున్న ఉద్యమంపై ట్విట్టర్‌లో తనదైన శైలిలో స్పందించారు. చలో విజయవాడకు తరలివచ్చిన వేలాది ఉద్యోగుల చిత్రాలను జోడించి.. ‘‘ఏపీ సర్కారు సంగతేమోగానీ, విజయవాడలో జన సందోహాన్ని చూసి నాకు చలి జ్వరం వచ్చింది’’ అని ట్వీట్‌ చేశారు.

  • It is a shock to me that so many lakhs of government employees can come on to the roads to protest against their own government..I doubt if this ever happened anywhere in the world ever pic.twitter.com/n4adBosbca

    — Ram Gopal Varma (@RGVzoomin) February 3, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • A P సర్కార్ సంగతేమో గానీ విజయవాడలో జన సందోహాన్ని చూసి నాకు భయం తో చలి జ్వరం వచ్చేసింది😳😳😳 pic.twitter.com/ImFu9oyciR

    — Ram Gopal Varma (@RGVzoomin) February 3, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

‘ఉద్యోగులు ఇంత పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి తమ సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయడం ఆశ్చర్యంగా ఉంది. ప్రపంచంలో ఇలా ఎక్కడైనా జరిగిందంటారా? అని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘ఏపీలోని నిరసనకారులకు నేనిచ్చే సలహా ఒకటే..! గట్టిగా నినదించాల్సిన సమయంలోనూ మౌనంగా ఉండటం పిరికితనమే అని మరో ట్వీట్‌లో ప్రస్తావించారు.

గతంలో సినిమా టికెట్ల అంశంపైనా జగన్ ప్రభుత్వంపై వరస ట్వీట్లతో రామ్‌గోపాల్‌ వర్మ విమర్శలు గుప్పించారు.

ఇదీ చదవండి:

Balakrishna News: దేనికైనా సిద్ధం.. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా: బాలకృష్ణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.