ETV Bharat / city

దేవినేని అవినాష్ అనుచరుల్లో అసంతృప్తి!

author img

By

Published : Nov 13, 2019, 7:50 PM IST

పార్టీలో రాజకీయాలపై యువనేత దేవినేని అవినాష్ అనుచరులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తెదేపాలో జరుగుతున్న పరిణామాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.

Devineni Avinash

దేవినేని అవినాష్ అనుచరుల్లో అసంతృప్తి!

తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ అనుచరుల్లో అసంతృప్తి బయటపడింది. తన నివాసంలో జరిగిన కార్యకర్తల సమావేశానికి అవినాష్ హాజరయ్యారు. తమకు పార్టీలో తగిన ప్రాధాన్యం లభించడం లేదంటూ ఆవేదన చెందారు. గతంలో దేవినేని నెహ్రూ ప్రాతినిధ్యం వహించిన విజయవాడ తూర్పు, పెనమలూరు నియోజకవర్గాల్లో అక్కడి ఇన్​ఛార్జ్​లు తమను పట్టించుకోవడం లేదని అవినాష్ దృష్టికి తీసుకువచ్చారు. అనుచరుల అభిప్రాయాన్ని విన్న దేవినేని అవినాష్.. ఏమీ చెప్పకుండానే సమావేశం నుంచి వెళ్లిపోయారు.

sample description

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.