ప్రముఖ దర్శకులు డాక్టర్ దాసరి నారాయణ రావు... చిన్నకుమారుడు అరుణ్‌పై పెద్ద కుమారుడు ప్రభు... జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆస్తి తగాదాల కారణంగా బెదిరింపులకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. బుధవారం రోజు అరుణ్, అతడి భార్య... తమ ఇంటికి వచ్చి దూషించినట్లు తెలిపారు. తమ కుటుంబ సభ్యులపై దాడి చేశారని వివరించారు. ఓ ఆస్తికి సంబంధించిన వివాదం కోర్టులో ఉన్నప్పటికీ.... బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఇందుకు తన చెల్లెలు, ఆమె బంధువులు సహకరిస్తున్నారని అన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు... దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇవీ చూడండి: ఉద్యోగాల భర్తీపై సర్కారు చేతులెత్తేసింది : కోదండరాం