ETV Bharat / city

తెలుగు భాషపై ఫ్రాన్స్ దేశస్థుడి మమకారం..!

author img

By

Published : Dec 28, 2019, 5:43 PM IST

తెలుగు భాషలో సాహిత్యం చాలా గొప్పదని అంటున్నారు ఫ్రాన్స్ దేశానికి చెందిన డానియెల్ నేజర్స్. మన భాష, సంస్కృతులపై ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్న ఆయన... తెలుగును నిర్లక్ష్యం చేయవద్దని సూచిస్తున్నారు. అమ్మభాషపై పట్టు సాధిస్తే ఇతర భాషలు నేర్చుకోవడం సులభమని వ్యాఖ్యానించారు.

డానియెల్‌ నేజర్స్‌
డానియెల్‌ నేజర్స్‌

తెలుగు భాషకు కళాత్మక సౌందర్యం ఉంది. అతి ప్రాచీనమైన ఈ భాషలో సాహిత్యం చాలా గొప్పదని ఫ్రాన్స్‌లోని ప్రాచ్య భాష, నాగరికతల జాతీయ సంస్థ ఆచార్యులుగా సేవలందిస్తోన్న డానియెల్‌ నేజర్స్‌ తెలిపారు. తెలుగు భాషపై ప్రేమతో... ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు హాజరయ్యేందుకు ఫ్రాన్స్ నుంచి విజయవాడకు వచ్చిన ఆయన ఈటీవీ భారత్​తో ముచ్చటించారు.

డానియెల్‌ నేజర్స్‌తో ముఖాముఖి

మాతృభాషలోనే బోధన జరగాలి

చిన్నప్పటి నుంచే ఎవరికైనా మాతృభాష సహజసిద్ధంగా వస్తుందని... వ్యాకరణ తర్కం దానంతట అదే వచ్చేస్తుందని డానియెల్ తెలిపారు. అమ్మ భాషలో నేర్చుకుంటే ఆలోచన శక్తి విస్తృతమవుతుందని స్పష్టం చేశారు. మాతృభాషపై పట్టు సాధించగలిగితే పరభాషలు నేర్చుకోవటం ఏ మాత్రం కష్టం కాదని ఆయన వెల్లడించారు. యూరోపియన్ యూనియన్​లోని దేశాల్లో మాతృ భాషలోనే బోధనకు ప్రాధాన్యం ఇస్తారని వెల్లడించారు. ఫ్రాన్స్‌ దేశస్థుడైన ఆయన తెలుగుభాష, సంస్కృతులపై దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తున్నారు.

ఇదీ చదవండి:సీఎం జగన్​కు విశాఖలో ఘనస్వాగతం

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.