ETV Bharat / city

కేంద్ర ప్రభుత్వ విధానాలపై విజయవాడలో సీపీఎం నిరసన

author img

By

Published : Aug 22, 2020, 12:19 AM IST

కేంద్ర ప్రభుత్వ విధానాలపై విజయవాడలో సీపీఎం ఆధ్వర్యంలో నిరసనలు జరిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేత సీహెచ్​ బాబూరావు పాల్గొన్నారు. లాభాల బాటలో కార్పొరేట్ల కంపెనీలను నడిపిస్తూ.... అప్పుల ఊబిలోకి సామాన్యులను నెట్టుతోందని ఆయన కేంద్రంపై విమర్శించారు.

cpm leader babu rao participated in this protest at vijayawada
విజయవాడలో జరిగిన నిరసనలో పాల్గొన్న నేత సీపీఎం బాబూరావు

కరోనా సమయంలో కార్పొరేట్లకు రూ. 19 వేల కోట్లు రుణమాఫీ చేసి.. పేదలకు కేంద్రం మొండి చెయ్యి చూపించిందని సీపీఎం నాయకులు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై విజయవాడలో సీపీఎం ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో ఆ పార్టీ నేత సీహెచ్​ బాబూరావు తదితరులు పాల్గొన్నారు. సామాన్యుల కష్టాలు గాలికొదిలి... మతోన్మాద, రాజకీయ ఎజెండాతో మోడీ సర్కారు వ్యవహరిస్తుందనిఆయన అన్నారు. అసంఘటిత కార్మికులకు ఉపాధి కరువైందని, ఆదాయం తగ్గిందని ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి :

సచివాలయం వద్ద హమాలీలు, ముఠా కార్మికుల నిరసన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.