ETV Bharat / city

CPI MEETING: 'విశాఖ ఉక్కు ఉద్యమాన్ని పార్టీలకు అతీతంగా తీవ్రం చేయాలి'

author img

By

Published : Jul 11, 2021, 7:55 PM IST

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ చర్యలను నిరసిస్తున్నట్లు సీపీఐ ప్రకటించింది. 150 రోజులుగా అన్ని రాజకీయపార్టీలు, ట్రేడ్ ​యూనియన్లు ప్రజా సంఘాలు ఉద్యమిస్తున్నప్పటికీ కేంద్ర నిమ్మకు నీరెత్తినట్లు ఉందని ఆ పార్టీ నాయకులు మండిపడ్డారు.

మాట్లాడుతున్న సీపీఐ రామకృష్ణ
మాట్లాడుతున్న సీపీఐ రామకృష్ణ

విశాఖ ఉక్కు కార్మాగారం ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఖండించారు. విజయవాడలో జరిగిన సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంపై కేంద్రం నియంతృత్వంగా వ్యవహరిస్తోందని చెప్పారు. పార్టీలకు అతీతంగా పోరాటాన్ని ఉద్ధృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇస్తున్న డబ్బులు... పునాదికే సరిపోతాయని, మిగిలినవి ప్రజలు అప్పులు తెచ్చుకునే పరిస్థితి ఉందని దుయ్యబట్టారు. పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా ఖాళీ చేయాలనడం దారుణమన్నారు. ఈ నెల 16న పోలవరంలో జరిగే అఖిలపక్ష పర్యటనలో సీపీఐ పాల్గొంటుందని చెప్పారు.

ఇదీ చదవండి:

venkaiah wishes: సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబం బోనాలు: ఉప రాష్ట్రపతి వెంకయ్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.