ETV Bharat / city

RAMAKRISHNA LETTER TO CM: అమరావతి పాఠాన్ని తిరిగి చేర్చాలి: రామకృష్ణ

author img

By

Published : Oct 6, 2021, 3:30 PM IST

CPI Ramakrishna letter to cm jagan
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

పదో తరగతి తెలుగు పాఠ్యపుస్తకం(Amravati lesson from 10th class book)లో అమరావతి పాఠ్యాంశాన్ని తొలగించడం దుర్మార్గమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. తెలుగు పాఠ్య పుస్తకంలో అమరావతి పాఠాన్ని తిరిగి చేర్చాలని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్​కి లేఖ(cpi Ramakrishna letter to cm jagan) రాశారు.

ముఖ్యమంత్రి జగన్​కి.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ లేఖ(cpi Ramakrishna letter to cm jagan) రాశారు. పదో తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో అమరావతి పాఠ్యాంశాన్ని తొలగించడం(Amaravati syllabus remove from school books) దుర్మార్గమని లేఖలో పేర్కొన్నారు. అమరావతి అనే పదంపై రాష్ట్ర ప్రభుత్వ వివక్షతకు ఇది అద్దం పడుతుందన్నారు. 2014లో 12 పాఠాలతో ముద్రించిన పదో తరగతి తెలుగు పుస్తకంలో రెండో పాఠంగా అమరావతి ఉందన్న రామకృష్ణ.. పాఠశాల విద్యాశాఖ ఇప్పుడు కొత్తగా అమరావతి పాఠాన్ని తొలగించి, మిగిలిన 11 పాఠాలతోనే పుస్తకాలు ముద్రించిందని ఆక్షేపించారు. దాదాపు 20 శతాబ్దాల ఘన చరిత్ర ఉన్న అమరావతి నేపథ్యాన్ని భావితరాలకు తెలియజెప్పాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. 10వ తరగతి పార్యపుస్తకంలో అమరావతి పాఠాన్ని తిరిగి చేర్చాలని రామకృష్ణ(cpi Ramakrishna on delete Amaravati syllabus) కోరారు.

ఇదీ చదవండి..

AMARAVATHI LESSON DELETED: పదో తరగతి నుంచి ‘అమరావతి’ పాఠం తొలగింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.