ETV Bharat / city

చురుగ్గా కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటు పనులు

author img

By

Published : May 4, 2021, 1:06 PM IST

covid center at vijayawada under durga temple
covid center at vijayawada under durga temple

ఇంద్రకీలాద్రి దుర్గగుడి దత్త సంస్థ సీవీరెడ్డి ఛారిస్‌ షెడ్డులో కొవిడ్‌ కేర్‌ కేంద్రం ఏర్పాటు పనులు చురుగ్గా సాగుతున్నాయి. కృష్ణా జిల్లా కలెక్టర్‌ పర్యవేక్షణలో ఈ కేంద్రం సేవలు అందిస్తుంది.

విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గగుడి దత్త సంస్థ సీవీరెడ్డి ఛారిస్‌ స్థలంలోని షెడ్లల్లో సంభవ్‌నాథ్‌ రాజేంద్ర సూరిజైన శ్వేతాంబర్‌ ట్రస్టు ఆధ్వర్యంలో చేపట్టిన కొవిడ్‌ కేర్‌ కేంద్రం ఏర్పాటు పనులు శరవేగంతో జరుగుతున్నాయి. దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, కమిషనర్‌ అర్జునరావు ఆదేశాలతో దుర్గగుడి ఈవో భ్రమరాంబ ఈ పనులకు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేశారు. రెండు నెలల పాటు ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సెంటర్‌.. సెకండ్‌ వేవ్‌ ప్రభావంతో ఇబ్బందులు పడే దేవస్థానం సిబ్బందితో పాటు శ్వేతాంబర ట్రస్టు సూచించిన కరోనా బాధితులకు సేవలు అందించేందుకు మార్గం సుగమం అయ్యింది.

కృష్ణా జిల్లా కలెక్టర్‌ పర్యవేక్షణలో ఈ కేంద్రం సేవలు అందిస్తుంది. నాలుగు షెడ్లల్లో రెండు షిఫ్టుల్లో పనిచేసేందుకు నర్సులు, పల్మనాలజిస్టులను నియమించే పనులో ట్రస్టు నిర్వాహకులు ఉన్నారు. దేవాదాయ శాఖ సూచనల మేరకు 30 శాతం పడకలు దేవస్థానం సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల బాధితులకు ఉచిత సేవలు అందించేందుకు వినియోగిస్తారు. మిగిలిన 70 శాతం ట్రస్టు సూచించిన వ్యక్తులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వారానికి రూ.21 వేలు రుసుము తీసుకొని సేవలు అందించే విధంగా దేవాదాయ శాఖ నిబంధనలు విధించింది. పాతబస్తీలో కొవిడ్‌ కేర్‌ కేంద్రం ఏర్పాటు చేసేందుకు సువిశాలమైన స్థలం ఉన్న ప్రాంతం ఇదే కావడంతో ట్రస్టు నిర్వాహకులు దీనిని ఎంపిక చేశారు. నాలుగు రోజుల్లో ఈ సెంటర్‌ పూర్తి స్థాయిలో బాధితులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ట్రస్టు నిర్వాహకులు తెలిపారు.

ఇదీ చదవండి: తిరుమలలో అగ్నిప్రమాదం... ఒకరు సజీవదహనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.