ETV Bharat / city

పోలీసుల వద్దకు రెవెన్యూ ఉద్యోగుల పంచాయితీ!

author img

By

Published : Sep 24, 2020, 5:45 PM IST

విజయవాడ నార్త్ జోన్ తహసీల్దార్ కార్యాలయంలో ఉద్యోగుల మధ్య గొడవ పోలీసుల వద్దకు చేరింది. తనను ఆర్​ఐ శివకృష్ణ, మరో వ్యక్తి వేధింపులకు గురి చేస్తున్నారని ఆ కార్యాలయంలో జూనియర్​ అసిస్టెంట్​గా విధులు నిర్వహిస్తున్న వరప్రసాద్.... సింగ్​నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కలెక్టర్​ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినట్లు చెప్పారు.

Fighting between employees at the Jayawada North Zone Tehsildar's office went as far as to lodge a complaint at the police station.
Fighting between employees at the Jayawada North Zone Tehsildar's office went as far as to lodge a complaint at the police station.

విజయవాడ నార్త్ జోన్ తహసీల్దార్ కార్యాలయంలో ఉద్యోగుల మధ్య పోరు పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు వరకూ వెళ్లింది. ఇటీవల ఇదే కార్యాలయంలో అవినీతి జరుగుతోందని... వివిధ రకాల ధ్రువీకరణ పత్రాలను లంచాల కోసమే పెండింగ్​లో పెడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో అనిశా అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. అదే సమయంలో కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఆర్​ఐ శివకృష్ణపై ఆరోపణలు వచ్చాయి. అయినా అతనిని బదిలీ చేసి చేతులు దులుపుకున్నారు రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు.

ఆర్​ఐ శివకృష్ణ నార్త్ తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో శ్రీను అనే యువకుడిని అనధికారికంగా తన కింద నియమించుకున్నాడు. విషయం తహసీల్దార్ దృష్టికి వెళ్లటంతో శ్రీనును కార్యాలయంలోకి రావొద్దని ఆదేశించారు. ఈ విషయంపై తానే సమాచారం ఇచ్చానన్న అనుమానంతో సదరు ఆర్​ఐ, ప్రైవేట్ ఉద్యోగి శ్రీను వేధింపులకు గురి చేస్తున్నారని కార్యాలయంలో జూనియర్​ అసిస్టెంట్​గా విధులు నిర్వహిస్తున్న వరప్రసాద్.... సింగ్​ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా ఫోన్​పే యాప్ ద్వారా తన ఖాతాలోకి నగదు వేస్తున్నారని పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. ఆర్​ఐ అవినీతిపై విచారణ చేయాలని... తనని చంపుతానని బెదిరిస్తున్న ప్రైవేట్ ఉద్యోగి శ్రీనుపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్​కూ ఫిర్యాదు చేసినట్లు బాధితుడు వర ప్రసాద్ చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.