ETV Bharat / city

నాటుసారా, జె బ్రాండ్ మద్యంపై అధ్యయన కమిటీ: చంద్రబాబు

author img

By

Published : Mar 16, 2022, 9:16 PM IST

Updated : Mar 17, 2022, 3:48 AM IST

నాటుసారా, జె బ్రాండ్ వ్యవస్థపై అధ్యయన కమిటీ వేయనున్నట్లు తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. జె టాక్స్‌ వల్ల రాష్ట్రంలో కల్తీసారా విక్రయం పెరుగుతోందన్న ఆయన.. కల్తీసారా, జె బ్రాండ్ మద్యం వల్లే మరణాలు ఎక్కువయ్యాయన్నారు.

నాటుసారా, జె.బ్రాండ్ మద్యంపై అధ్యయన కమిటీ
నాటుసారా, జె.బ్రాండ్ మద్యంపై అధ్యయన కమిటీ

జె టాక్స్‌ వల్ల రాష్ట్రంలో కల్తీసారా విక్రయం పెరుగుతోందని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. కల్తీసారా, జె బ్రాండ్ మద్యం వల్లే ఎక్కువమంది మృతి చెందుతున్నారన్నారు. తెదేపా శాసనసభాపక్ష సమావేశంలో వైకాపా వైఫల్యాలను ఎండగడ్డిన ఆయన.. నాటుసారా, జె బ్రాండ్ వ్యవస్థపై అధ్యయన కమిటీ వేయనున్నట్లు తెలిపారు.

వ్యాపారులను తీవ్రంగా వేధిస్తున్నారు

వ్యాపారులను తీవ్రంగా వేధిస్తున్నారు..

వసూళ్లకు పాల్పడుతూ వ్యాపారుల్ని ప్రభుత్వం తీవ్రంగా వేధిస్తోందని చంద్రబాబు ధ్వజమెత్తారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఎన్టీఆర్‌ భవన్‌లో అమరజీవికి ఆయన నివాళులర్పించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఆర్యవైశ్యులు, వ్యాపారులు చంద్రబాబును కలిసి తమ సమస్యల్ని చెప్పుకున్నారు. రాజకీయ ఉద్దండుడు కొణిజేటి రోశయ్యను గౌరవించుకునేలా ప్రభుత్వ సంస్థకో, కార్యక్రమానికో ఆయన పేరు ఎందుకు పెట్టరని..? చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు. తెలుగు దేశం ప్రభుత్వం వచ్చిన తరువాత కొణిజేటి రోశయ్యకు తగిన గౌరవం ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఆర్ధిక మంత్రి అంటే రోశయ్య పేరు గుర్తు వస్తుందని.. అలాంటి మహా నేతకు నివాళి ఘటించడానికి కూడా సీఎం జగన్‌కు మనసు రాలేదని దుయ్యబట్టారు.

రోశయ్యకు నివాళులర్పించడానికి జగన్‌కు మనసు రాలేదు

పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం వల్లనే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటయ్యాయని చంద్రబాబు కొనియాడారు. ‘రాష్ట్రంలో ఎంతో ఉన్నతస్థాయికి వెళ్లిన రాజకీయ ఉద్ధండుడు కొణిజేటి రోశయ్యను కూడా ప్రభుత్వం తగురీతిలో గౌరవించలేదు. రోశయ్యకు నివాళులర్పించడానికి కూడా ముఖ్యమంత్రి జగన్‌కు మనసు రాలేదు. మాజీ సీఎంలు వెంగళరావు, విజయభాస్కర్‌రెడ్డి, చెన్నారెడ్డి చనిపోతే తెదేపా హయాంలో ప్రభుత్వ సంస్థలకు వారి పేరు పెట్టాం. ఇప్పుడు రోశయ్యను గౌరవించుకునేలా ప్రభుత్వ సంస్థకో, కార్యక్రమానికో ఎందుకు పేరు పెట్టరు? మేం అధికారంలోకి వచ్చాక రోశయ్యను తగిన విధంగా గౌరవిస్తాం’ అని వెల్లడించారు.

అందుకే నాటుసారా వైపు చూస్తున్నారు: అచ్చెన్న

జె బ్రాండ్ మద్యం కొనలేకే పేదలు నాటుసారా వైపు చూస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్రంలో అక్రమ మద్యం ఏరులై పారుతోందని మండిపడ్డారు. నాసిరకం మద్యంతో ప్రభుత్వానికి రూ.22 వేల కోట్లకు పైగా ఆదాయం వస్తోందని ఆరోపించారు.

నాటుసారా, జె.బ్రాండ్ మద్యంపై అధ్యయన కమిటీ

ఇదీ చదవండి

సభలో చర్చించకుండా ప్రభుత్వం తప్పించుకు తిరుగుతోంది: లోకేశ్

Last Updated :Mar 17, 2022, 3:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.