ETV Bharat / city

Municipal Elections: దొంగ ఓటర్లను అడ్డుకుంటే అరెస్టులు చేసి వేధిస్తారా ?: చంద్రబాబు

author img

By

Published : Nov 14, 2021, 5:50 PM IST

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీసులు వైకాపా కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. అక్రమాలు చేసేవారిని వదిలి ప్రతిపక్షాన్ని వేధిస్తారా ? అని ప్రశ్నించారు. నెల్లూరులో తెదేపా నేత శ్రీనివాసులును మంత్రి అనిల్ వేధిస్తున్నారని..,వేధింపులు తట్టుకోలేకే శ్రీనివాసులు ఆత్మహత్యకు యత్నించారని అన్నారు.

దొంగ ఓటర్లను అడ్డుకుంటే అరెస్టులు చేసి వేధిస్తారా ?
దొంగ ఓటర్లను అడ్డుకుంటే అరెస్టులు చేసి వేధిస్తారా ?

పురపాలక ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్న అధికార పార్టీ నేతలను వదిలి ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొని వేధించటం దుర్మార్గమని తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పంలో నోట్ల కట్టలు పంచుతూ పట్టుబడ్డ వైకాపా నేతలను అదుపులోకి తీసుకోకుండా..తెలుగుదేశం నేతలను పోలీసులు బెదిరించడం అనైతికం, అప్రజాస్వామికమని ఆయన మండిపడ్డారు. దొంగ ఓట్లు వేయడానికి వచ్చేవారిని అడ్డుకొని ప్రశ్నిస్తే..తెదేపా నేతలను అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు.

నెల్లూరులో తెదేపా అభ్యర్థులకు మద్దతిస్తున్న తమ పార్టీ నేత కప్పిర శ్రీనివాసులును మంత్రి అనిల్ వారం రోజులుగా పోలీస్ స్టేషన్​కు పిలిపించి వేధించడం వైకాపా నాయకుల శాడిస్టు, సైకో మనస్థత్వానికి నిదర్శనమన్నారు. వైకాపా నేతల వేధింపులు తట్టుకోలేక శ్రీనివాసులు ఆత్మహత్యకు యత్నించాడని ఆరోపించారు. శ్రీనివాసులుకు ఎటువంటి ప్రాణహాని జరిగినా మంత్రి అనిల్ కుమార్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. చట్టానికి విరుద్దంగా వ్యవహరించిన పోలీసులు న్యాయస్థానం ముందు తలొంచుకుని నిలబడాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఇదీ చదవండి: TDP PROTEST: తెదేపా అభ్యర్థి భర్త అరెస్ట్.. పీఎస్​ ఎదుట కోటంరెడ్డి ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.