ETV Bharat / city

పోలవరం తాజా ధరలపై కేంద్ర జల సంఘం సానుకూలం

author img

By

Published : Dec 30, 2020, 5:04 AM IST

పోలవరం నిర్మాణానికి 2017-18 ధరల ప్రకారం రూ.47,725.74 కోట్ల నిధులు ఇస్తేనే (తాగునీటికయ్యే రూ.7,214.67 కోట్లతో సహా) ప్రాజెక్టు పూర్తి చేయగలరని గతంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) చేసిన సిఫార్సుకు కేంద్ర జలసంఘం సానుకూలంగా  స్పందించింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖకు నివేదించినట్లు ఏపీ జలవనరుల శాఖ అధికారులకు వర్తమానం అందింది. దీనికి సంబంధించిన దస్త్రం కేంద్ర ఆర్థిక శాఖకు పంపే అవకాశం ఉంది.

పోలవరం తాజా ధరలపై కేంద్ర జల సంఘం సానుకూలం
పోలవరం తాజా ధరలపై కేంద్ర జల సంఘం సానుకూలం

గతంలో... 2013-14 ధరల ప్రకారం రూ.29,027.95 కోట్లుగా లెక్కించి అందులో తాగునీటి విభాగానికి, విద్యుత్తు కేంద్ర నిర్మాణానికి అయ్యే నిధులను మినహాయించి రూ.20,398.61 కోట్లు మాత్రమే ఇస్తామని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంటూ కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాసింది. ఈ అంశాన్ని పీపీఏ సమావేశంలో ఆమోదించి పంపిన తర్వాతే మిగిలిన నిధులు విడుదల చేస్తామని షరతు పెట్టింది. ఈ నేపథ్యంలో నవంబరు 2న జరిగిన పీపీఏ సమావేశంలో అంచనాల సవరణపై చర్చించిన విషయం తెలిసిందే. అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ ప్రతిపాదనలకు ఆమోదం తెలియజేస్తూనే ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఆ నిధులు సరిపోవని, రూ.47,725.74 కోట్లు ఇవ్వాల్సిందేనని పీపీఏ సిఫార్సు చేసింది. అందులో తాగునీటి విభాగం కింద కేటాయించిన రూ.7,214.67 కోట్లు మినహాయించకుండా ఇవ్వాలని కూడా స్పష్టం చేసింది. ఈ సిఫార్సులను కేంద్ర జలశక్తి శాఖ... కేంద్ర జలసంఘానికి పంపి మదింపు చేయాలని సూచించింది. కేంద్ర జల సంఘంలో సీనియర్‌ సభ్యుడు హల్దర్‌ ఆధ్వర్యంలోని బృందం దీన్ని అధ్యయనం చేసి తాజాగా సానుకూల నివేదికను పంపింది. ఏపీ జలవనరులశాఖ అధికారులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

ఇదీ చదవండి: రాజమహేంద్రవరానికి చెందిన మహిళకు స్ట్రెయిన్ నిర్ధరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.