ETV Bharat / city

CBN: 'వైకాపా పాలనలో వారికి అన్యాయం..అక్రమ కేసులతో వేధింపులు'

author img

By

Published : Aug 19, 2021, 6:33 PM IST

వైకాపా పాలనలో బీసీలను అక్రమ కేసులతో వేధిస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. తెదేపా బీసీ నేతలతో సమావేశం నిర్వహించిన ఆయన.. బీసీల రాజకీయ రిజర్వేషన్లను సీఎం జగన్‌ కుదించారన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక 35కు పైగా బీసీ పథకాలు రద్దు చేశారని ఆక్షేపించారు. జగన్ పాలనలో అన్యాయానికి గురైన ప్రతి బీసీకి తెదేపా అండగా ఉంటుందని అన్నారు.

'వైకాపా పాలనలో వారికి అన్యాయం..అక్రమ కేసులతో వేధింపులు
'వైకాపా పాలనలో వారికి అన్యాయం..అక్రమ కేసులతో వేధింపులు

జగన్ ప్రభుత్వంలో అన్యాయం జరిగిన ప్రతి బీసీకి అండగా నిలుస్తామని తెదేపా అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. పార్టీ బీసీ నేతలతో సమావేశం నిర్వహించిన ఆయన... బీసీల కోసం గతంలో తమ ప్రభుత్వం అమలు చేసిన పథకాల్లో సగం కూడా అమలు చేయటం లేదన్నారు. బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటూ.., రాజకీయంగా అణచివేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. బీసీలకు రాజకీయ సామాజిక అభివృద్ధికి పునాది వేసిన ఘనత తెదేపాకే దక్కుతుందన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక దాదాపు 35కు పైగా పథకాలను రద్దు చేశారని మండిపడ్డారు. బీసీలకు రాజకీయాల్లో అవకాశాలు మెరుగు పర్చడమే లక్ష్యంగా నాడు రిజర్వేషన్లను ప్రోత్సహించామని...జగన్ ప్రభుత్వం మాత్రం బీసీలకు తీరని ద్రోహం చేస్తోందన్నారు.

బీసీ జనగణన విషయంలోనూ జగన్ ప్రభుత్వం వివక్ష చూపుతోందని చంద్రబాబు మండిపడ్డారు. రెండేళ్లుగా బీసీలను మభ్యబెట్టడం తప్ప చేసిందేమీ లేదన్నారు. కార్పొరేషన్ల నిధులు ఖర్చు చేయకుండా నిర్వీర్యం చేశారన్నారని ఆరోపించారు. బీసీలపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనివర్శిటీ వీసీల్లో, సెర్చ్ కమిటీల్లో, సలహాదారుల్లో, టీటీడీ బోర్డులో, విద్యుత్ సంస్కరణ బోర్డుల్లో ఎక్కడా బీసీల ప్రాధాన్యం లేకుండా చేశారని దుయ్యబట్టారు. ప్రాధాన్యత కలిగిన పదవులన్నింటిని సొంత సామాజికవర్గానికి కేటాయించి..అప్రధాన్యమైన పదవులు, కార్పొరేషన్ పదవులు బీసీలకు కేటాయించి చేతులు దులుపుకున్నారని ఎద్దేవా చేశారు. బీసీ కార్పొరేషన్ల పేరుతో హడావుడి తప్ప బీసీలకు చేసిందేమీ లేదన్నారు. 2 వేల కంటే తక్కువ జనాభా కలిగిన 81 కులాలకు కార్పొరేషన్లు లేకుండా చేశారన్నారు.

చంద్రబాబు పత్రికా ప్రకటన
చంద్రబాబు పత్రికా ప్రకటన

రాజకీయంగా బీసీల్లో చీలికలు తీసుకొచ్చేందుకు జగన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. వాలంటీర్ల ద్వారా తన ప్రణాళికను గ్రామస్థాయిలో అమలు చేస్తూ..బీసీలను అణగదొక్కుతున్నారన్నారు. అనాదిగా కుల వృత్తిపై ఆధారపడిన వారిని ఇంకా ఇబ్బందులు పెడుతున్నారన్నారు. 70 వేల మందికి నేతన్న నేస్తం ఇచ్చి అందరికీ ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. హత్యా రాజకీయాలతో బీసీలను అణగదొక్కుతున్నారని ఆక్షేపించారు.

ఇదీ చదవండి

CBN: ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి చంద్రబాబు ఫోన్‌..నేతల మంతనాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.