ETV Bharat / city

Purandeswari: రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు: పురందేశ్వరి

author img

By

Published : Sep 4, 2021, 3:09 PM IST

Updated : Sep 4, 2021, 4:33 PM IST

రాష్ట్ర ప్రభుత్వం అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని భాజపా నేత పురందేశ్వరి ఆక్షేపించారు. రాష్ట్రం మొత్తం అప్పుల కుప్పగా మారిందని.. కనీసం ఏ బ్యాంకు కూడా ముందుకొచ్చి అప్పు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.

రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు
రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు

రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు

వైకాపా ప్రభుత్వంలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని..భాజపా మహిళా నేత పురందేశ్వరి విమర్శించారు. కార్పొరేషన్ల పేరిట వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. విశాఖ భాజపా కార్యాలయంలో జరిగిన జాతీయ పదాదికారుల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్‌ను ఎక్కడకూ తరలిచమని...కార్మికులకు న్యాయం జరిగేందుకు సమిష్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు.

వైకాపా అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా..పాదయాత్రలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని పురందేశ్వరి ఆక్షేపించారు. రాష్ట్రంలో విధ్వంసక పాలన సాగిస్తూ..ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న భాజపా కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. అమ్మఒడి పేరుతో నగదు ఇస్తూ...మద్యం రూపంలో లాగేస్తున్నారని విమర్శించారు. ఆటోవాలాకు రూ. 10 వేలు ఇస్తున్నామని చెప్పి..విపరీతమైన చలానాలతో లాకొంటున్నారన్నారు. రాష్ట్రంలో ఇసుక ధరలు పెంచి నిర్మాణ రంగాన్ని నాశనం చేశారని దుయ్యబట్టారు.

రాష్ట్రం మొత్తం అప్పుల కుప్పలుగా మారింది. కార్పొరేషన్ల పేరుతో వేల కోట్ల అప్పులు చేశారు. కనీసం ఏ బ్యాంకు కూడా ముందుకొచ్చి అప్పు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎక్కడికి తరలిపోదు. కార్మికులకు న్యాయం జరిగేందుకు సమష్టిగా పోరాడాలి. -పురందేశ్వరి, భాజపా మహిళా నేత

ఇదీ చదవండి

IAS TRANSFERS: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ

Last Updated : Sep 4, 2021, 4:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.