ETV Bharat / city

Indrakeeladri: భవానీ దీక్షల షెడ్యూల్ విడుదల.. వివరాలు ఇవే

author img

By

Published : Nov 7, 2021, 1:01 PM IST

Updated : Nov 7, 2021, 1:07 PM IST

ఈ నెల 15 నుంచి భవానీ మండల దీక్షధారణలు నిర్వహించనున్నట్లు దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్ సోమినాయుడు వెల్లడించారు. ఈమేరకు భవానీ దీక్షలకు సంబంధించిన పోస్టర్లు(Bhavani Deeksha Schedule Release)ను ఛైర్మన్ సోమినాయుడు ఆవిష్కరించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.

భవానీ దీక్ష షెడ్యూల్ విడుదల

భవానీ దీక్షలకు సంబంధించిన పోస్టర్లును దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్ సోమినాయుడు విష్కరించారు. ఈ ఏడాది 8-9 లక్షలమంది భవానీ దీక్షలు(Bhavani Deeksha Schedule Release) తీసుకుంటారని అంచనా వేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. భక్తులు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించినట్లు ఆయన తెలిపారు. ఉచిత భోజన వితరణకు ఏర్పాట్లు చేస్తున్నామని.. ఎంతమంది మాల వేస్తున్నారో చెప్పాలని గురుస్వాములకు సూచించారు.

దేవస్థానం వెల్లడించిన దీక్షధారణల వివరాలు(Bhavani Deeksha Schedule announced)

  • ఈ నెల 15 నుంచి భవానీ మండల దీక్షధారణలు
  • ఈ నెల 15 నుంచి 19 వరకు భవానీ మండల దీక్షధారణలు
  • డిసెంబరు 5 నుంచి 9 వరకు భవానీ అర్ధమండల దీక్షలు
  • డిసెంబరు 18న సాయంత్రం 6.30 గం.కు కలశజ్యోతి ఉత్సవం
  • డిసెంబరు 25 నుంచి 29 వరకు శతచండీయాగం, గిరిప్రదక్షిణలు
  • డిసెంబరు 25 నుంచి 29 వరకు భవానీ దీక్షల విరమణ
  • డిసెంబరు 29న ఉ.10.30 గం.కు పూర్ణాహుతి భవానీ దీక్ష విరమణ
  • ఉదయం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు ఆలయంలో దర్శనాలు
  • ఉచిత దర్శనం, రూ.100 టికెట్లు ఆన్‌లైన్‌లో పొందేందుకు ఏర్పాట్లు

భవానీలు వస్త్రాలు వదిలేందుకు ప్రత్యేక ఏర్పాట్లు: ఈవో
భవానీల కోసం మరో కేశఖండనశాల ఏర్పాటు చేస్తున్నట్లు ఈవో భ్రమరాంబ తెలిపారు(Durga temple Eo Bhramaramba on arrangements of Bhavani Deeksha). సీతమ్మవారి పాదాల వద్ద వస్త్రాలు వదిలి వెళ్తున్నందున.. భవానీలు వస్త్రాలు వదిలేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో వెల్లడించారు. భక్తుల రద్దీని బట్టి దర్శన సమయాన్ని పెంచుతామన్నారు. గిరి ప్రదక్షిణల(Bhavani Deeksha Schedule announced) కోసం కలెక్టర్ అనుమతికి నివేదించినట్లు ఈవో పేర్కొన్నారు.

ఇదీ చదవండి..

కనకదుర్గమ్మ ఆలయంలో చోరీ.. తాళిబొట్టు కాజేసిన దొంగలు!

Last Updated : Nov 7, 2021, 1:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.