ETV Bharat / city

సర్పంచ్​ల అరెస్ట్​ దారుణం: వైవీబీ రాజేంద్రప్రసాద్

author img

By

Published : Oct 8, 2022, 1:54 PM IST

YVB Rajendraprasad: గ్రామీణ ప్రజల సమస్యలను ప్రభుత్వానికి ఆందోళనల రూపంలో వ్యక్తపరిచిన సర్పంచ్‌లను అరెస్టు చేయడం దారుణమని ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్ ధ్వజమెత్తారు. ఆర్థిక సంఘం నిధులు 8 వేల 700 కోట్లను ప్రభుత్వం వెంటనే పంచాయతీల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్​ చేశారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

YVB Rajendraprasad
వైవీబీ రాజేంద్రప్రసాద్

YVB Rajendraprasad: గ్రామీణ ప్రజల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వానికి బలంగా తెలిపిన సర్పంచ్​ల అరెస్ట్​లు దారుణమని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వైవీబీ రాజేంద్రప్రసాద్ ధ్వజమెత్తారు. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలో ఉన్న12,918 మంది సర్పంచ్​లు నిధులు, విధులు, హక్కులు, అధికారాల సాధనకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఆర్థిక సంఘం నిధులు రూ.8,700 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పంచాయతీల ఖాతాల్లో జమ చేయటంతో పాటు గ్రామ సర్పంచ్​ల గౌరవ వేతనాలను రూ.15000కు పెంచాలని రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు. సర్పంచ్​ల ద్వారానే గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే అధికారాలను పునరుద్ధరించాలని, తమ డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించకుంటే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

వైవీబీ రాజేంద్రప్రసాద్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.