ETV Bharat / city

బ్రహ్మంగారిమఠం కేసులో.. తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు!

author img

By

Published : Jul 14, 2021, 4:37 PM IST

బ్రహ్మంగారి మఠం కేసులో హైకోర్టులో ఇవాళ వాదనలు జరిగాయి. దివంగత మఠాధిపతి రెండో భార్య వేసిన పిటిషన్​పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.

ap High Court reserved judgment in the Brahmangari matam case
బ్రహ్మంగారిమఠం కేసులో తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు

బ్రహ్మంగారి మఠంపై దాఖలైన పిటిషన్​పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. మఠాధిపతిగా తమను గుర్తించాలని దివంగత పీఠాధిపతి శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి రెండో భార్య మారుతి మహాలక్ష్మి, ఆమె కుమారుడు గోవిందస్వామి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మఠాధిపతి విషయంలో దేవాదాయశాఖ జోక్యం చేసుకుందని, తమను బలవంతంగా ఒప్పించారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ఉత్తర్వులు జారీ చేసే అధికారం దేవాదాయ ప్రత్యేక కమిషనర్​కు లేదన్నారు.

మఠానికి సంబంధించిన విషయంలో ధార్మిక పరిషత్ జోక్యం చేసుకుంటుందన్నారు. మఠాధిపతి విషయంలో ధార్మిక పరిషత్ తీర్మానం చేసిందని.. దాని ప్రకారమే తాత్కాలిక మఠాధిపతిగా ప్రత్యేక అధికారిని నియమించామని ప్రభుత్వం తరపు న్యాయవాది ధర్మాసనానికి వివరించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. శుక్రవారం తీర్పును వెలువరించనున్నట్లు హైకోర్టు తెలిపింది.

ఇదీ చదవండి:

brahmamagari pitham: బ్రహ్మంగారి పీఠంపై తెగని పంచాయితీ.. హైకోర్టుకు చేరిన వివాదం!

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.