ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 3PM

author img

By

Published : Mar 4, 2021, 3:00 PM IST

...

andhrapradesh top news
andhrapradesh top news

  • 'ఒక్క అవకాశం ఇచ్చినందుకే.. స్టీల్​ప్లాంట్​ను అమ్మేస్తున్నారు'
    విశాఖలో తెలుగుదేశం ఎన్నికల ప్రచారంలో వేగం పెంచింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌... గాజువాక రోడ్‌షోలో పాల్గొన్నారు. ప్రజలు సీఎంకు అవకాశమిచ్చినందుకు స్టీల్‌ప్లాంట్‌ను అమ్మేస్తున్నారని లోకేశ్ ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
  • చాలానే నిధులొచ్చాయ్..!
    మోదీ ప్రభుత్వం గడచిన ఐదేళ్లలో దాదాపు రెండు లక్షల 34 వేల కోట్ల రూపాయిల మొత్తాన్ని రాష్ట్రానికి వివిధ పద్దుల కింద విడుదల చేసిందని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా పేరు మినహా ఆ రూపేణా రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను వివిధ రూపాలలో అందించిందన్నారు. వీటిని ప్రజల్లోకి తీసుకువెళ్లలేకపోయామన్నది వాస్తవమని ఆయన విశాఖలో అంగీకరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
  • నిర్బంధ ఏకగ్రీవాలు ఇప్పుడే చూస్తున్నా
    గుంటూరులో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పాత గుంటూరులో 8వ వార్డు అభ్యర్థి జంగాల రమాదేవికి మద్దతుగా ప్రచారం చేశారు. వైకాపా... నిర్బంధ ఏకగ్రీవాలకు పాల్పడుతోందని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
  • సినీఫక్కీలో హత్యాయత్నం
    ఓ ఎంపీటీసీపై సినీ ఫక్కీలో హత్యాయత్నం జరిగింది. అర్ధరాత్రి వేళ బైక్​పై వెళ్తున్న ఎంపీటీసీని కొందరు కారులో వెంబడించగా.. వారి నుంచి తప్పించుకునేందుకు మరో మార్గంలో వెళ్లేందుకు యత్నించాడు. ఈ ఎత్తును ముందే ఊహించిన దుండగులు.. అక్కడ మరో ముఠాను సిద్ధంగా ఉంచారు. అదృష్టం కొద్ది అక్కడి నుంచీ ఎంపీటీసీ తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. తర్వాత ఏమైందంటే..? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
  • శశికళ గుడ్​బై​: లాభం ఎవరికి? నష్టపోయేదెవరు?
    రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో, ఏ రోజు ఎవరు ఏ పార్టీలో ఉంటారో ఊహించడం.. తలపండిన విశ్లేషకులకు సైతం ఒక్కోసారి అసాధ్యమైన విషయం. తాజాగా.. రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు శశికళ చేసిన ప్రకటన కూడా అలాంటిదే. జైలు నుంచి విడుదలై ఇక తమిళనాట క్రియాశీల పాత్ర పోషిస్తారని భావించిన వేళ.. ఆమె తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమైంది. ఇంతకీ... ఎందుకిలా? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
  • మమత కోసం శివసేన కీలక నిర్ణయం
    బంగాల్ శాసనసభ​ ఎన్నికల్లో పోటీ చేయొద్దని శివసేన నిర్ణయించింది. మమతా బెనర్జీకి మద్దతుగా నిలిచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
  • పరువు హత్య
    ఉత్తర్​ప్రదేశ్​లో పరువు కోసం కన్న కూతురి తల నరికి చంపిన ఘటన మరువక ముందే.. రాజస్థాన్​ దౌసాలో అచ్చం ఇటువంటి ఘటనే జరిగింది. పెళ్లి చేసిన తర్వాత.. గతంలో ప్రేమించిన ప్రియుడితో పారిపోయిందని కన్న కూతుర్నే కడతేర్చాడు ఓ తండ్రి. పోలీసు స్టేషన్​లో లొంగిపోయి.. తన కుమార్తెను చంపినట్లు పోలీసులకు చెప్పాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
  • ఉద్యోగుల టీకా ఖర్చులు మేమే భరిస్తాం
    దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్​ జోరందుకున్న నేపథ్యంలో టెక్​ దిగ్గజాలు ఇన్ఫోసిస్​, యాక్సెంచర్లు కీలక నిర్ణయం తీసుకున్నాయి. తమ సిబ్బందికి కరోనా టీకా కోసమయ్యే ఖర్చులను తామే భరించనున్నట్లు ప్రకటించాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
  • ధోనీ రికార్డు సమం చేయడంపై కోహ్లీ ఏమన్నాడంటే?
    టెస్టుల్లో సుదీర్ఘ కాలం టీమ్​ఇండియాకు నాయకత్వం వహించడం సంతోషంగా ఉందని చెప్పాడు విరాట్ కోహ్లీ. తన ప్రయాణం నమ్మశక్యంగా లేదన్నాడు. ఇంగ్లాండ్​తో మొతేరాలో జరుగుతున్న టెస్టు మ్యాచ్​తో భారత్​ తరఫున 60టెస్టులకు కెప్టెన్సీ వహించిన సారథిగా ధోనీ సరసన చేరాడు కోహ్లీ. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
  • అనుపమ పెళ్లి క్రికెటర్ బుమ్రాతో ఫిక్స్!​
    చివరి టెస్టు నుంచి బుమ్రా విశ్రాంతి తీసుకోవడం, అనుపమ గుజరాత్​ వెళ్లడం లాంటి విషయాలు కొద్దిరోజుల వ్యవధిలో జరగడం వల్ల నెటిజన్లు ఓ అభిప్రాయానికి వచ్చేశారు. వీరిద్దరి పెళ్లి జరగనుందని ఫిక్సయిపోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.