ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 7PM

author img

By

Published : Mar 3, 2021, 7:01 PM IST

...

andhrapradesh 7pm top news
andhrapradesh 7pm top news

  • సహకార వ్యవస్థలు పారదర్శకంగా ఉండాలి: సీఎం జగన్

పీఏసీఎస్(ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల) నెట్​వర్క్​ను మరింత పెంచాలని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ప్రతి మూడు రైతు భరోసా కేంద్రాలకు ఒక పీఏసీఎస్ ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. సహకార వ్యవస్థలు పూర్తి పారదర్శకంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. పీఏసీఎస్​ నివేదికల్లో తేడా వస్తే థర్డ్ పార్టీతో స్వతంత్ర విచారణ జరపాలని ఆదేశించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • పుర పోరు: చిత్తూరు నగరపాలక సంస్థ వైకాపా కైవసం

చిత్తూరు నగరపాలక సంస్థ వైకాపా కైవసం చేసుకుంది. చిత్తూరులోని 50 డివిజన్లలో 37 చోట్ల వైకాపా ఏకగ్రీవమైంది. చిత్తూరులో మిగతా 13 డివిజన్లకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • పలమనేరు పురపాలక సంఘం వద్ద తోపులాట

చిత్తూరు జిల్లా పలమనేరు పురపాలక సంఘం వద్ద వైకాపా - తెదేపా నాయకులు ఘర్షణకు దిగారు. పురపాలక సంఘం కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు వైకాపా నాయకులు ప్రయత్నించగా.. తెదేపా నాయకులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • స్వామీజీ.. మా అభ్యర్థిని గెలిపించండి: నారాయణ

జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర సంఘటన జరిగింది. సీపీఐ అభ్యర్థి ఆర్.యశోద 97వ వార్డులో ప్రచారం నిర్వహిస్తుండగా... సీపీఐ జాతీయ నేత శారదా పీఠాన్ని సందర్శించారు. ''స్వామీజీ.. మిమ్మల్ని కలిసి గెలిపించాలని కోరిన వారందరినీ గెలిపిస్తారంటగా... మా పార్టీ అభ్యర్థిని కూడా గెలిపించండి'' అని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • 'కొవాగ్జిన్ టీకా 81% సమర్థవంతం'

ఐసీఎంఆర్​తో కలిసి కరోనా నిరోధక టీకాను అందుబాటులోకి తెచ్చిన దేశీయ సంస్థ భారత్‌ బయోటెక్‌.. మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ ఫలితాలను ప్రకటించింది. కొవాగ్జిన్‌ మధ్యంతర క్లినికల్‌ సామర్థ్యం 81 శాతమని తెలిపింది. మరింత సమాచారాన్ని సేకరించేందుకు.. కొవాగ్జిన్‌ సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు క్లినికల్ ట్రయల్స్‌ కొనసాగుతాయని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • టీకా ధ్రువపత్రంపై మోదీ చిత్రం అధికార దుర్వినియోగమే

ప్రధాని మోదీ అధికార దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ తృణమూల్​ కాంగ్రెస్..​ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ ఇచ్చే టీకా ధ్రువీకరణ పత్రాలపై మోదీ ఫొటోను చిత్రీకరించడాన్ని తప్పుపట్టింది. టీకా తయారీలో కీలక పాత్ర పోషించిన శాస్త్రవేత్తల కృషిని మోదీ పక్కన పెట్టేశారని సీనియర్​ నేత డెరెక్​ ఓబ్రీన్​ దుయ్యబట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • శశికళను అన్నాడీఎంకేలోకి చేర్చుకునే ప్రసక్తే లేదు

శశికళను కూటమిలో చేర్చుకునేది, లేనిది అన్నాడీఎంకే పార్టీనే నిర్ణయిస్తుందని తమిళనాడు భాజపా ఇంఛార్జ్​ సీటీ రవి పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై వెంటనే స్పందించిన అన్నాడీఎంకే.. శశికళను ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీలోకానీ, కూటమిలో కానీ చేర్చుకునేది లేదని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • నిరసనకారులపై పోలీసుల కాల్పులు- ఆరుగురు మృతి!

మయన్మార్​లో సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా ప్రజలు చేస్తోన్న ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనల్లో ఆరుగురు మృతి చెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • మార్చిలో రిలీజ్​ అయ్యే టాప్​ స్మార్ట్​ఫోన్లు ఇవే

ఈ నెలలో మార్కెట్లోకి కొత్త మోడళ్లను తీసుకువచ్చేందుకు దిగ్గజ మొబైల్​ ఫోన్​ కంపెనీలన్నీ సిద్ధమయ్యాయి. షియోమీ నుంచి నోట్​ 10, శాంసంగ్​ నుంచి బడ్జెట్ సెగ్మెంట్​లో ఎం 12 వంటి మోడళ్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఇంకా ఏఏ కంపెనీలు కొత్త మోడళ్లను విడుదల చేయనున్నాయి? వాటి ఫీచర్లు ఎలా ఉండనున్నాయి అనే వివరాలు మీ కోసం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • శ్రీదేవిని గుర్తు చేసిన జాన్వీ కపూర్!

జాన్వీకపూర్​ నటించిన 'రూహి' చిత్రంలో ఓ పాట విడుదలై అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇందులో జాన్వీ వేసిన స్టెప్పులు, పలికించిన హావభావాలు తన తల్లి శ్రీదేవిని గుర్తు చేసేలా ఉన్నాయి. ఆ వీడియోను మీరూ చూసేయండి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.