ETV Bharat / city

విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌తో ప్రాణహాని ఉందని మహిళ ఫిర్యాదు

author img

By

Published : Aug 22, 2022, 6:33 PM IST

Women Alligationఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం చేసుకుని తనను వివాహం చేసుకున్నడాని, ఇప్పుడు వదిలించుకోడానికి చూస్తున్నాడని ఓ మహిళ ఆరోపించింది. చంపేస్తానని బెదిరిస్తున్నాడని అవేదనకు లోనయ్యింది.

get rid of her
ఫేస్‌బుక్‌ లో పరిచయం తర్వాత పెళ్లి

Women Alligation: రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ తోలేటి శ్రీకాంత్‌ నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ.. ఓ మహిళ విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం చేసుకున్న శ్రీకాంత్‌ తనని 2017లో వివాహం చేసుకున్నాడని సాయికుమారి అనే మహిళ తెలిపింది. కట్నం కింద తన ఆస్తులను తీసుకున్నాడని, ఇప్పుడు తనని వదిలించుకోవడానికి చూస్తున్నాడని ఆరోపించింది. పోలీసుల ద్వారా భయపెట్టిస్తూ.. ఊరు వదిలి వెళ్లకపోతే చంపేస్తానని హెచ్చరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తనకు 2004లో వివాహం అయ్యిందని, వివాహం చేసుకున్న వ్యక్తి నుంచి విడాకులు తీసుకున్నానని సాయికుమారి తెలిపింది, తర్వాత 2016వ సంవత్సరంలో శ్రీకాంత్ తో ఫేస్‌బుక్‌ పరిచయం ఏర్పడిందన్నారు. 2017లో శ్రీకాంత్ తనను రెండో వివాహం చేసుకున్నాడని, పెళ్లి చేసుకున్న సమయంలో కట్నం ఏమి ఇవ్వలేదని శ్రీకాంతో అనడంతో, తన వద్ద ఉన్న అస్తులన్ని అతనికి ఇచ్చానని అమె పేర్కోంది. ఇప్పుడు వదిలించుకోవాలని చూస్తున్నాడని ఆమె తెలిపింది.

సాయికుమారి, బాధితురాలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.