ETV Bharat / city

Top news: ప్రధాన వార్తలు @1PM

author img

By

Published : Dec 11, 2021, 12:59 PM IST

1 PM top  news
1 PM top news

.

  • మృతి చెందిన వేద విద్యార్థుల కుటుంబాలకు రూ.50వేల చొప్పున సాయం
    five students died in krishna river: గుంటూరు జిల్లా మాడిపాడు ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున అందిస్తామని విశాఖ శ్రీ శారదాపీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి అన్నారు. మిగిలిన విద్యార్థులను తమ వేద పాఠశాలలో చదివిస్తామని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • School Education On Merging: 'హైస్కూళ్లలో 100లోపు విద్యార్థులుంటే విలీనం వద్దు'
    merging schools: పాఠశాలల విలీనంపై పాఠశాల విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో 100లోపు విద్యార్థులున్న ఉన్నత పాఠశాలల్లోకి ప్రాథమిక బడుల నుంచి 3, 4, 5 తరగతులను విలీనం చేయకూడదని ఉత్తర్వులు విడుదల చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపై నేడు చంద్రబాబు సమీక్ష
    CBN REVIEW: నెల్లూరు జిల్లాలో తాజాగా జరిగిన కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపై తెదేపా అధినేత నేడు సమీక్ష నిర్వహించనున్నారు. వైఫల్యాలకు గల కారణాలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Crime News: తన భర్తతో సంబంధం పెట్టుకుందని..ఆమె ఏం చేసిందంటే..!
    woman murder: తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను.. ఆ వ్యక్తి భార్యే హత్య చేసిన ఉదంతం విజయవాడలోని రాణిగారితోటలో చోటు చేసుకుంది. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • India Covid Cases: 559 రోజుల కనిష్ఠానికి యాక్టివ్ కేసులు
    India Covid Cases: దేశంలో కొవిడ్ వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది. కొత్తగా 7,992 కేసులు వెలుగులోకి వచ్చాయి. 393 మరణాలు సంభవించాయి. శుక్రవారం 76,36,569 మందికి టీకాలు అందించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • దిల్లీ సరిహద్దులను ఖాళీ చేస్తున్న రైతులు- విజయ యాత్రతో స్వస్థలాలకు
    Farmers Protest End: సుదీర్ఘ నిరసనలకు తెరదించుతూ దిల్లీ సరిహద్దులను ఖాళీ చేస్తున్నారు రైతులు. పెండింగ్​ డిమాండ్లపై కేంద్రం నుంచి అధికారిక లేఖ అందిన క్రమంలో ఆందోళనలు విరమిస్తున్నట్లు ప్రకటించిన అన్నదాతలు.. స్వస్థలాలకు పయనమయ్యారు. ట్రాక్టర్లను అందంగా ముస్తాబు చేసి విజయ యాత్ర చేపట్టారు. పలువురు రైతులు నృత్యాలు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఆన్​లైన్​ గేమ్స్​లో అసలు పేర్లు వాడకూడదు- కేంద్రం ఆదేశాలు
    ఆన్​లైన్​ గేమ్స్​, వాటిలో చేసే కొనుగోళ్లు పిల్లలు, తల్లిదండ్రులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని విషయం తెలిసిందే. తాజాగా దీనిపై కేంద్రం అప్రమత్తమైంది. ఆన్‌లైన్‌ గేముల్లో కొనుగోళ్లు చేపట్టేందుకు తల్లిదండ్రుల అనుమతిని తప్పనిసరి చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Taiwan China: చైనా బలప్రయోగం.. తైవాన్​పైకి 13 యుద్ధవిమానాలు
    China planes in Taiwan airspace: తైవాన్ గగనతలంలోకి చైనా యుద్ధవిమానాలు మరోసారి చొరబడ్డాయి. మొత్తం 13 విమానాలు తమ ఎయిర్ డిఫెన్స్ జోన్​లోకి ప్రవేశించినట్లు తైవాన్ రక్షణ శాఖ తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఇంగ్లాండ్​పై ఆసీస్ విజయం.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టాప్​కు!
    WTC 2021-23 Points Table: యాషెస్ సిరీస్​లో భాగంగా ఇంగ్లాండ్​తో జరిగిన తొలి టెస్టులో విజయం సాధించిన ఆస్ట్రేలియా ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. ఇంగ్లాండ్ ఆరో స్థానానికి పడిపోయింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • RRR movie: ఏపీ సినిమా టికెట్‌ రేట్లు.. ఎన్టీఆర్‌ సాయం తీసుకుంటారా?
    RRR movie: హైదరాబాద్​లో 'ఆర్​ఆర్​ఆర్' చిత్రబృందం విలేకర్ల సమావేశం నిర్వహించింది. రాజమౌళి, తారక్​, రామ్​చరణ్,​ ఆలియా భట్, నిర్మాత దానయ్య​ పలు విషయాలను తెలిపారు. ఇందులో భాగంగా ఏపీలో సినిమా టికెట్ల విషయంపై​ నిర్మాత దానయ్యకు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన ఏం చెప్పారంటే.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.