ETV Bharat / city

తితిదే వార్షిక బడ్జెట్ ఎంతో తెలుసా..!

author img

By

Published : Feb 17, 2022, 11:46 AM IST

Updated : Feb 17, 2022, 1:19 PM IST

ttd
ttd

11:44 February 17

తిరుమల అన్నమయ్య భవన్‌లో తితిదే పాలక మండలి సమావేశం

ttd board meeting : తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం అన్నమయ్య భవన్‌లో ప్రారంభమైంది. ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో.... 49 అంశాలతో సిద్ధంచేసిన అజెండాపై చర్చించనున్నారు. దీంతో పాటు 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 3 వేల171 కోట్ల రూపాయల అంచనాతో రూపొందించిన బడ్జెట్‌ లో.... శ్రీవారి హుండీ ద్వారా వేయి కోట్ల రూపాయల ఆదాయం లభిస్తుందని అంచనా వేశారు. కరోనా తీవ్రత తగ్గుతున్న నేపథ్యంలో.. శ్రీవారి దర్శన టిక్కెట్ల పెంపు, శ్రీవారి ఆర్జిత సేవలకు భక్తుల అనుమతిపై చర్చించనున్నారు. తిరుపతిలో చిన్నపిల్లల ఆసుపత్రి నిర్వహణకోసం సూతన ట్రస్టును ప్రవేశపెట్టడంపై బోర్డు సమావేశంలో చర్చించనున్నారు. సభ్యుల ఆమోదంతో శ్రీవేంకటేశ్వర అపన్న హృదయం పేరిట నూతన పథకం ప్రారంభించనున్నారు. తిరుపతిలో నిర్మిస్తున్న శ్రీనివాస సేతు పనులకు తితిదే వాటాగా 25 కోట్ల రూపాయల నిధుల విడుదలపై నిర్ణయం తీసుకోసున్నారు. తితిదేలో నూతన పీఆర్సి విధానం అమలు చేయడంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

భారీ విరాళమిచ్చిన భక్తురాలు

తిరుమల శ్రీవారికి భారీ విరాళం ఇచ్చింది ఓ భక్తురాలు. చెన్నై మైలాపూర్​కు చెందిన స్వర్గీయ డాక్టర్‌ పర్వతం పేరిట ఆమె సోదరి రేవతి విశ్వనాథం రూ.9.20 కోట్లు విరాళంగా ఉచ్చారు. అందులో 6 కోట్ల రూపాయలు విలువైన ఆస్థి కాగా... రూ.3.20 కోట్లు బ్యాంకు డిపాజిట్లుగా ఉన్నాయి. విరాళంకు సంబంధించిన పత్రాలను శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డికి రేవతి విశ్వనాథం అంగజేశారు. బ్యాంకు డిపాజిట్లను చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణంకు వియోగించాలని విజ్ఞప్తి చేశారు. రూ.6 కోట్ల విలువైన ఆస్తులను స్వామివారి పేరిట మార్చనున్నారు. డాక్టర్ పర్వతం కన్నుమూయడంతో ఆమె జ్ఞాపకార్థంగా ఈ ఆస్తిని శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు రేవతి విశ్వనాథం తెలిపారు.

ఇదీ చదవండి :

TTD: ఘనంగా శ్రీ ఆంజ‌నేయ‌స్వామి జ‌న్మస్థాన అభివృద్ధికి భూమిపూజ

Last Updated : Feb 17, 2022, 1:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.