ETV Bharat / city

తిరుపతి బైపోల్​: 2019 ఎన్నికలతో పోలిస్తే పెరిగిన ఓట్ల శాతం

author img

By

Published : May 3, 2021, 7:16 AM IST

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో అధికార వైకాపా విజయం సాధించింది. 2019 ఎన్నికలతో పోలిస్తే..ఎక్కువ ఆధిక్యతను వైకాపా సొంతం చేసుకుంది.

tirupathi by elections
ఎన్నికల లెక్కింపు ప్రక్రియ

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో.. 2019 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే వైకాపాకు మెజారిటీ, ఓట్ల శాతం కొంత పెరిగాయి. తెదేపా ఓట్ల శాతం తగ్గింది. జనసేనతో జట్టుకట్టిన భాజపా కొంత మేర ఓట్ల శాతం పెంచుకోగలిగింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో.. తిరుపతి శాసనసభ స్థానంలో తెదేపాకు మెజారిటీ రాగా, మిగిలిన 6శాసనసభ స్థానాల్లోను వైకాపా మెజారిటీ సాధించింది. ఈ ఎన్నికల్లో తిరుపతి సహా మొత్తం 7శాసనసభ స్థానాల్లోనూ వైకాపా ఆధిక్యం సాధించింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైకాపాకు 54.91 శాతం మేరకు ఓట్లు రాగా ఇప్పుడు 56.67 శాతం ఓట్లు సాధించగలిగింది. తెదేపాకు గత ఎన్నికల్లో 37.56 శాతం ఓట్లు వస్తే, ఈసారి 32.09 శాతానికి పడిపోయింది. గతంతో పోలిస్తే తెదేపాకు 5.47 శాతం తగ్గింది. గత ఎన్నికల్లో భాజపాకు కేవలం 1.22 శాతం ఓట్లు రాగా, ఇప్పుడు జనసేనతో కలసి పోటీ చేయడంతో 5.17 శాతం ఓట్లు వచ్చాయి.

tirupathi by elections
నియోజకవర్గాల వారీగా ఓట్లు, శాతం

ఇదీ చదవండి: తిరుపతిలో వైకాపాదే విజయం.. అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ ఫ్యాన్ గాలి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.