ETV Bharat / city

చోరీకి యత్నించిన దొంగ... అనుమానాస్పద మృతి... ఏం జరిగిందంటే..?

author img

By

Published : May 17, 2022, 2:13 PM IST

Thief suspicious death
దొంగ అనుమానాస్పద మృతి

Thief suspicious death: చోరీ చేసేందుకు వెళ్లిన దొంగ ప్రాణాలు కోల్పోయాడు. ఓ ఇంట్లో చేసిన చోరీ యత్నం అతడిని బలితీసుకుంది. అలవాటు దొంగతనానికి వెళ్లిన అతడు... ఆ ఇంటి సభ్యులకు అడ్డంగా దొరికిపోయాడు. తప్పించుకోవడం కుదరలేదు. చివరికి వారి చేతిలో దెబ్బలు తిన్నాడు. పోలీసులు వచ్చి ఆస్పత్రికి తరలించారు. ఏమైందో ఏమో కానీ కాసేపట్లోనే విగతజీవిగా మారాడు. ఈ ఘటనలో తిరుపతి జిల్లాలో చోటు చేసుకుంది.

Thief suspicious death: తిరుపతి జిల్లా గూడూరులో చోరీకి వచ్చిన దొంగ అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. గూడురులో అర్ధరాత్రి ఓ ఇంట్లో చోరీ చేసేందుకు దొంగ యత్నించాడు. చోరీని అడ్డుకున్న ఇంటి యజమానులపై కర్రతో దాడి చేశాడు. దీంతో అప్రమత్తమైన వారు అతనిని పట్టుకుని కొట్టి కట్టేసి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. దొంగను గూడూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. కాసేపటికే మృతి చెందాడు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.