ETV Bharat / city

వైకాపా నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు: వామపక్షాలు

author img

By

Published : Apr 17, 2021, 5:01 PM IST

Updated : Apr 17, 2021, 7:19 PM IST

సీపీఎం, సీపీఐ, రిపబ్లికన్ పార్టీల ఆధ్వర్యంలో.. తిరుపతిలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. ప్రజాస్వామ్యాన్ని వైకాపా ఖూనీ చేస్తోందంటూ పలువురు నేతలు నిరసనకు దిగారు. దొంగ ఐడీ కార్డులు సృష్టించి మరీ రిగ్గింగ్​కు పాల్పడుతున్నారన్నారు.

left parties protest in tirupati, protests on tirupati bi polls rigging
తిరుపతిలో వామపక్షాల నిరసన, తిరుపతి ఉప ఎన్నికలపై వామపక్షాల ఆందోళన

తిరుపతి లోక్​సభ ఉపఎన్నికలో ప్రజాస్వామ్యాన్ని వైకాపా నేతలు ఖూనీ చేస్తున్నారని వామపక్షాల నేతలు ఆరోపించారు. సీపీఐ, సీపీఎం, రిపబ్లిక్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం ముందు నిరసనకు దిగారు. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో వైకాపా నేతలు ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారని విమర్శించారు. పరిసర ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో ప్రజలను బస్సుల్లో తీసుకువచ్చి.. బోగస్ గుర్తింపు కార్డులతో ఓట్లు వేయించేందుకు ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

దొంగ ఓటర్లను తరలిస్తున్న బస్సు పట్టివేత

Last Updated : Apr 17, 2021, 7:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.