ETV Bharat / city

TTD: బ్రహ్మోత్సవాల నిర్వహణపై తితిదే ఛైర్మన్‌, ఈవోతో ముఖాముఖి

author img

By

Published : Oct 5, 2022, 2:25 PM IST

Interview with TTD Chairman: సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించామని తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఈ ఏడాది గరుడ సేవ రోజు ప్రయోగాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలు రానున్న రోజుల్లో కొనసాగిస్తామని ప్రకటించారు. వాహన సేవల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన గరుడ సేవ రోజు భక్తులకు సంతృప్త స్థాయిలో దర్శనం కల్పించామన్నారు.

Interview with TTD Chairman and EO
తితిదే ఛైర్మన్‌, ఈవోతో ముఖాముఖి

Interview with TTD EO: సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించామని తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి తెలిపారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు చక్రస్నానంతో ముగిశాయని తితిదే ఛైర్మన్​ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాలు విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. సెప్టెంబర్‌ 27 నుంచి నేటి వరకు వైభవంగా బ్రహ్మోత్సవాలు జరిగాయని తెలిపారు.

తితిదే ఛైర్మన్‌, ఈవోతో ముఖాముఖి

సీఎం జగన్ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారని.. బ్రహ్మోత్సవాల్లో 5.69 లక్షల మంది భక్తులకు సర్వదర్శనం కల్పించామన్నారు. బ్రహ్మోత్సవాల్లో 24 లక్షల లడ్డు విక్రయాలు జరిగాయన్నారు. బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి రూ.20.43 కోట్ల హుండీ ఆదాయం వచ్చిందన్నారు. ఈ ఏడాది కార్తిక దీపోత్సవం వైభవంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.

బ్రహ్మోత్సవ నిర్వహణపై తితిదే ఛైర్మన్‌తో ఈటీవీ భారత్ నిర్వహించిన ముఖాముఖి కార్యక్రంలో తెలిపారు. ఈ ఏడాది గరుడ సేవ రోజు ప్రయోగాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలు రానున్న రోజుల్లో కొనసాగిస్తామని ప్రకటించారు. వాహన సేవల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన గరుడ సేవ రోజు భక్తులకు సంతృప్త స్థాయిలో దర్శనం కల్పించామన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.