ETV Bharat / city

తిరుపతిలో సినీ నటుడు, వ్యాఖ్యాత ప్రదీప్ సందడి

author img

By

Published : Feb 3, 2021, 10:01 AM IST

సినీ నటుడు, వ్యాఖ్యాత ప్రదీప్ మాచిరాజు తిరుపతిలో సందడి చేశారు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? సినిమా విజయోత్సవ యాత్రలో భాగంగా.. మంగళవారం తిరుపతిలోని సీఎస్ థియేటర్​కి వెళ్లారు. ప్రేక్షకులను అలరించారు.

hero pradeep went to tirupathi for success meet of his movie
తిరుపతిలో సందడి చేసిన సినీ హీరో, వ్యాఖ్యాత ప్రదీప్ మాచిరాజు

తిరుపతిలో సందడి చేసిన సినీ హీరో, వ్యాఖ్యాత ప్రదీప్ మాచిరాజు

30 రోజుల్లో ప్రేమించడం ఎలా? చలనచిత్ర కథానాయకుడు ప్రదీప్ మాచిరాజు.. తిరుపతిలో సందడి చేశారు. సినిమా విజయోత్సవంలో భాగంగా మంగళవారం తిరుపతిలోని సీఎస్ థియేటర్​కి విచ్చేసి ప్రేక్షకులను అలరించారు.

ఈ సందర్భంగా అభిమానులు ప్రదీప్​తో స్వీయచిత్రాలు దిగేందుకు ఆరాటపడ్డారు. తన మొదటి సినిమాను ప్రేక్షకులు విజయవంతం చేసినందుకు ప్రదీప్ కృతజ్ఞతలు తెలిపారు. చిత్ర దర్శకుడు మున్నా, యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

'క్రాక్' దర్శకుడితో బాలయ్య.. త్వరలో ముహూర్తం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.