ETV Bharat / city

Govindananda Saraswati: హనుమంతుని జన్మస్థలంపై.. తితిదే దైవద్రోహం చేస్తోంది: గోవిందానంద సరస్వతి

author img

By

Published : Feb 14, 2022, 3:16 PM IST

Govindananda Saraswati on hanuman birth place : హనుమంతుడు తిరుమలలోని అంజనాద్రిలో పుట్టలేదని.. కర్ణాటకలోని కిష్కింధలో పుట్టారని హనుమత్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వ్యవస్థాపకులు గోవిందానంద సరస్వతి స్పష్టం చేశారు. తితిదే దైవద్రోహం చేస్తోందని... అంజనాద్రి పేరుతో దుకాణాలు ఏర్పాటు చేసి డబ్బులు సంపాదించేందుకు తితిదే ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

Govindananda Saraswati
Govindananda Saraswati

తితిదే దైవద్రోహం చేస్తోంది

Govindananda Saraswati on hanuman birth place : హనుమంతుడు తిరుమలలోని అంజనాద్రిలో పుట్టలేదని... కర్ణాటక రాష్ట్రం కిష్కింధలోని పంపానది క్షేత్రంలోనే జన్మించారని హనుమత్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వ్యవస్థాపకులు గోవిందానంద సరస్వతి స్పష్టం చేశారు. హనుమద్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహించనున్న రథయాత్ర వాహనాన్ని ఆయన తిరుపతిలో ప్రారంభించారు.

తితిదే దైవద్రోహం చేస్తోంది...

తితిదే దైవద్రోహం చేస్తోందని.. హనుమంతుని జన్మస్థలం పేరుతో నకలీ పుస్తకాన్ని ముద్రించిందని గోవిందానంద సరస్వతి ఆరోపించారు. తితిదే పాలకమండలి నాటకం ఆడుతోందని... సన్యాసులను, ప్రజలను తితిదే మోసం చేస్తోందన్నారు. అంజనాద్రి పేరుతో నిర్మాణాలు చేయడం ద్వారా.. దుకాణాలు ఏర్పాటు చేసి డబ్బులు సంపాదించేందుకు తితిదే ప్రయత్నిస్తోందని విమర్శించారు. 1200 కోట్ల రూపాయలతో కిష్కింధను అభివృద్ధి చేయనున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి ప్రకటించారన్నారు. కిష్కింధ హనుమంతుని జన్మస్థలమని ప్రజలకు తెలియజేసేందుకు హనుమత్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో 12 సంవత్సరాల పాటు దేశవ్యాప్తంగా రథయాత్ర చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.

ఇదీ చదవండి

Hanuman birth story : హనుమంతుడి జన్మవృత్తాంతంపై పుస్తకం... ఎప్పుడంటే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.