ETV Bharat / city

LIVE VIDEO: తిరుచానూరులో వరద ధాటికి కుప్పకూలిన భవనం

author img

By

Published : Nov 19, 2021, 10:48 AM IST

వరద ధాటికి కుప్పకూలిన భవనం
వరద ధాటికి కుప్పకూలిన భవనం

చిత్తూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తిరుచానూరులో వరద ధాటికి ఓ ఇల్లు కుప్పకూలింది.

వరద ధాటికి కుప్పకూలిన భవనం

రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తిరుచానూరులోని వసుంధర నగర్​లో భవనం నేలకూలింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. కలికిరిలోని మదనపల్లి -తిరుపతి ప్రధాన రహదారిపై కలికిరి పెద్ద చెరువు మొరవ నీళ్లు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో ఈ మార్గంలో రాకపోకలను దారి మళ్లించారు. రేణిగుంటలోని ఓ చర్చిలో చిక్కుకున్న వారిని ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి. తిరుపతి గ్రామీణ మండలం చిగురువాడ వద్ద వంతెన కూలిపోవడంతో రాకపోకలు స్తంభించాయి. సమీపంలోని శివాలయం నీట మునిగింది.

ఇదీ చూడండి:

WEATHER UPDATE: పుదుచ్చేరి-చెన్నై మధ్య తీరం దాటిన వాయుగుండం.. రాష్ట్రంలో భారీ వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.