ETV Bharat / city

రాజమహేంద్రవరంలో రౌడీషీటర్ దారుణ హత్య

author img

By

Published : Jan 30, 2021, 5:51 PM IST

rowdy sheeter murdered at rajamahendra varam
రాజమహేంద్రవరంలో రౌడీ షీటర్ దారుణ హత్య

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సతీశ్​ అనే రౌడీ షీటర్​ను శుక్రవారం అర్ధరాత్రి దుండగులు హతమార్చారు. మద్యం మత్తులో సతీశ్​పై దాడి చేసి చంపినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇతనిపై 14 కేసులు ఉన్నాయి.

రాజమహేంద్రవరంలో రౌడీ షీటర్ దారుణ హత్య

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. కుక్కుల సతీశ్​ అనే వ్యక్తిని పాత కక్షల నేపథ్యంలో దుండగులు హతమార్చారు. శుక్రవారం అర్ధరాత్రి రాజేంద్రనగర్ 12 కుళాయిల జంక్షన్ వద్ద కత్తులు, బండరాళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. కొన ఊపిరితో ఉన్న సతీశ్​ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. ఇతనిపై 14 కేసులు ఉన్నాయి.

వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మద్యం మత్తులో సతీశ్​పై దాడి చేసి హతమార్చినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. సతీశ్​ కుటుంబసభ్యులు ప్రభుత్వాసుపత్రి వద్ద కన్నీరుమున్నీరుగా విలపించారు. సతీశ్​ భార్య నాలుగు నెలల గర్భవతి అని ఆతని సోదరుడు చెప్పాడు.

ఇదీ చదవండి: పెరుగులంక భూ వివాదంలో ఇసుక మాఫియా లేదు: డీఎస్పీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.