ETV Bharat / city

'పొరపాట్లకు తావు లేకుండా కౌంటింగ్‌ జరగాలి'

author img

By

Published : Apr 24, 2021, 1:09 PM IST

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియను పటిష్ఠంగా చేపట్టాలని నెల్లూరు జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి కేవీఎన్‌ చక్రధర్‌బాబు ఆదేశించారు. డి.కె. డబ్ల్యూ. కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములను పరిశీలించారు. స్ట్రాంగ్ రూముల రిజిస్ట్రార్లను తనిఖీ చేశారు. కౌంటింగ్ హల్స్ లో కొవిడ్ నిబంధనలు కచ్చితంగా అమలు చేయడం తోపాటు లైటింగ్, బ్యారికేడింగ్ ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

collector observed strong rooms at Nellore
collector observed strong rooms at Nellore

కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియను పటిష్ఠంగా చేపట్టాలని నెల్లూరు జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి కేవీఎన్‌ చక్రధర్‌బాబు ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో మే 2న జరగనున్న కౌంటింగ్‌ ప్రక్రియపై వెంకటగిరి, సూళ్లూరుపేట, గూడూరు, సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల సహాయ రిటర్నింగ్‌ అధికారులు, తహసీల్దార్లు, మాస్టర్‌ ట్రైనర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

తిరుపతి, సత్యవేడు, శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గాలకు తిరుపతిలో, వెంకటగిరి, సూళ్లూరుపేట, గూడూరు, సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్‌ ప్రక్రియ నెల్లూరులోని డీకేడబ్ల్యూ కళాశాలలో జరుగుతుందని కలెక్టర్ వివరించారు. పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకుని, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా విధులు నిర్వహించాలని సూచించారు. కొవిడ్‌ దృష్ట్యా కౌంటింగ్‌ హాళ్ల సంఖ్యను పెంచామని, అందుకు అనుగుణంగా ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. ప్రతి కౌంటింగ్‌ టేబుల్‌ వద్ద మైక్రో అబ్జర్వర్‌ పర్యవేక్షణ ఉండేలా చర్యలు చేపట్టాలని, ఈవీఎంలను స్ట్రాంగ్‌ రూము నుంచి కౌంటింగ్‌ టేబుళ్ల వద్దకు, అక్కడినుంచి స్ట్రాంగ్‌ రూముకు చేర్చే ప్రక్రియను ఓ ప్రణాళికబద్ధంగా చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా వీవీప్యాట్స్‌ కౌంటింగ్‌ ఏర్పాట్లు ప్రత్యేకంగా చేపట్టాలన్నారు. తొలుత జాయింట్‌ కలెక్టర్‌ బాపిరెడ్డి పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ హరేంధిరప్రసాద్‌, నగరపాలకసంస్థ కమిషనర్‌ దినేష్‌కుమార్‌, గూడూరు సబ్‌ కలెక్టర్‌ గోపాలకృష్ణ, డీఆర్వో చిన్న ఓబులేసు, నాయుడుపేట ఆర్డీవో సరోజిని తదితరులు పాల్గొన్నారు.

స్ట్రాంగ్‌ రూముల పరిశీలన

నెల్లూరు డీకేడబ్ల్యూ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూములను శుక్రవారం కలెక్టర్‌ చక్రధర్‌బాబు పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. అక్కడ నిర్వహిస్తున్న రిజిస్టర్‌ను తనిఖీ చేశారు. కౌంటింగ్‌ హాళ్లలో కొవిడ్‌ ప్రొటోకాల్‌ను కచ్చితంగా అమలు చేయడంతో పాటు లైటింగ్‌, బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ... నేటి నుంచే అమలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.