ETV Bharat / city

srisailam: శ్రీశైలం జలశయానికి కొనసాగుతున్న వరద.. 2 గేట్లు ఎత్తి నీటి విడుదల

author img

By

Published : Aug 11, 2021, 8:53 AM IST

srisailam project information
srisailam project information

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో జలాశయం 2 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్​ ఇన్‌ఫ్లో 1,47,634 , ఔట్‌ఫ్లో 1,12,047 క్యూసెక్కులుగా ఉంది.

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం 2 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్​ ఇన్‌ఫ్లో 1,47,634,.. ఔట్‌ఫ్లో 1,12,047 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా..ప్రస్తుతం నీటిమట్టం 884.80 అడుగులకు చేరుకుంది.

శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా..ప్రస్తుత నీటి నిల్వ 214.3637 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం కుడి, ఎడమ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది.

ఇదీ చదవండి: 18 నుంచి శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.