ETV Bharat / city

నేను చిన్నప్పుడు ఎస్టీ... ఇప్పుడు బీసీ: మంత్రి జయరాం

author img

By

Published : Nov 11, 2019, 8:55 AM IST

minister gummanuru jayaram

వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన ప్రజలు రాష్ట్రంలో కష్టాలు ఎదుర్కొంటున్నారని మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. వారిని ఎస్టీ జాబితాలో చేర్చేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.

వాల్మీకిగా పుట్టినందుకు గర్విస్తున్నానని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. కర్నూలులో ఆదివారం నిర్వహించిన వాల్మీకి ఆత్మీయ సన్మాన సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చెర్చేందుకు కృషి చేస్తానని మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. కర్ణాటకలో వాల్మీకీలను ఎస్టీల్లో చేర్చారని చెప్పారు. బళ్లారిలో చదువుతున్న తన కుమారుడు అక్కడ ఎస్టీగా ఉన్నాడని.... రాష్ట్రంలో మాత్రం తాను బీసీగా ఉన్నానని మంత్రి తెలిపారు. తాను కూడా ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు పక్క రాష్ట్రంలో చదువుకున్నానని మంత్రి వెల్లడించారు. అప్పుడు తనకు ఎస్టీ సర్టిఫికేట్ వచ్చిందని గుర్తు చేసుకున్నారు. కేంద్రంపై ఒత్తిడి తెప్పించి వాల్మీకీలను ఎస్టీలుగా మార్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని మంత్రి జయరాం పేర్కొన్నారు.

మంత్రి గుమ్మనూరు జయరాం ప్రసంగం
Intro:ap_knl_13_10_minister_prog_ab_ap10056
వాల్మీకిగా పుట్టినందుకు గర్విస్తున్నానని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం కర్నూల్లో అన్నారు వాల్మీకి ఆత్మీయ సన్మాన సభ కర్నూలు నగరంలో నిర్వహించారు ఈ సన్మాన కార్యక్రమంలో అనంతపురం, హిందూపురం, నంద్యాల ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, పోచా బ్రహ్మనంద రెడ్డి పాల్గొన్నారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చెర్చేందుకు కృషి చేస్తానని మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. కర్ణాటకలో తన కొడుకు చదువుతున్నందుకు ఎస్ టి గా ఉన్నాడని ఇక్కడ మాత్రం తాను బీసీ గా ఉన్నానని మంత్రి తెలిపారు.
బైట్. గుమ్మనూరు జయరాం. రాష్ట్ర మంత్రి


Body:ap_knl_13_10_minister_prog_ab_ap10056


Conclusion:ap_knl_13_10_minister_prog_ab_ap10056
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.