ETV Bharat / city

అధికారుల "చెత్త" పని.. మనసులో పెట్టుకోవద్దన్న మేయర్!

author img

By

Published : Mar 30, 2022, 7:17 PM IST

Kurnool Mayor: కర్నూలులో ఓ షాపు యాజమాని ట్రేడ్ లైసెన్స్ కట్టనందుకు.. అధికారులు షాపులో చెత్త వేసి, షాపునకు తాళాలు వేశారు. ఈ ఘటనపై కర్నూలు మేయర్ బీ.వై. రామయ్య స్పందించారు.

Kurnool Mayor
Kurnool Mayor

Kurnool Mayor: కర్నూలులో ఓ షాపు యాజమాని ట్రేడ్ లైసెన్స్ కట్టనందుకు.. అధికారులు షాపులో చెత్త వేసి, షాపునకు తాళాలు వేశారు. ఈ విషయంపై కర్నూలు మేయర్ బీ.వై. రామయ్య స్పందించారు. పన్నులు కట్టి కర్నూలు అభివృద్ధికి సహకరించాలని కోరారు. పన్నులు కట్టని దుకాణాల ముందు ఇటీవల చెత్త వేసిన ఉదంతంపై మాట్లాడుతూ.. ఒకటీ అరా ఇలాంటి ఘటనలు ఏమైనా జరిగినా.. మనసులో పెట్టుకోవద్దని ప్రజలను కోరారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌ నిబంధనలు పాటిస్తూ పారిశుధ్యాన్ని నిర్వహిస్తున్నందుకు నామమాత్రంగా పన్ను వసూలు చేస్తున్నామని అన్నారు. అది చెత్త పన్ను కాదన్న మేయర్.. అది సేవా పన్ను అని చెప్పుకొచ్చారు.

మనసులో పెట్టుకోవద్దు -కర్నూలు మేయర్

ఇదీ చదవండి : Garbage in a Store: కర్నూలులో మున్సిపల్ అధికారుల నిర్వాకం.. చెత్త పన్ను కట్టలేదని..!

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.